AP Mega DSC: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!

ఏపీ నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 16వేల టీచర్ ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు డీఎస్సీ ఫైల్ పై మొదటి సంతకం చేశారు.

Ap Cabinet : నేడు తొలిసారి సమావేశం కానున్న ఏపీ కేబినేట్!
New Update

AP Mega DSC Notification: ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం చేశారు. ఈ మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనుండగా టీజీటీ 1781, ఎస్ జీటీ 6371,పీఈటీ 132, స్కూల్ అసిస్టెంట్ 7725, పీజీటీ 286, ప్రిన్సిపాల్ 52, మొత్తం 16,347 ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఇక చంద్రబాబు అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పై చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ సర్కార్ నోటిఫికేషన్ ను సవరించి.. 

ఇక 2024 మొదట్లో వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఇందులో 6,100 పోస్టుల భర్తీ చేస్తేందుకు సిద్ధమైంది. ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ), 2,299 స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), 1,264 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్‌ పోస్టులు ఉన్నాయి. డీఎస్సీతో పాటే టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. వీటికి సంబంధించి షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. అయితే టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం లేకపోవటంతో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ వాయిదా పడింది. వెంటనే కొత్త షెడ్యూల్ ను కూడా విద్యాశాఖ ప్రకటించింది. మరోవైపు టెట్ పరీక్షలను నిర్వహించింది. వీటికి సంబందించి ప్రాథమిక కీలు కూడా వచ్చాయి. ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో డీఎస్సీతో పాటు టెట్ ఫలితాల విడుదలకు బ్రేకులు పడ్డాయి.



టెల్ ఫలితాల కోసం ఎదురు చూపులు..

ఏపీ టెట్ ఫలితాల కోసం చాలా మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరటంతో ఏ క్షణమైనా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 7న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది. ఫిబ్రవరి 23 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు మార్చి 9న ముగిశాయి. ముందుగా విడుదల చేసి‌న షెడ్యూల్ ప్రకారం మార్చి 14న ఏపీ టెట్ ఫలితాలు విడుదల కావాల్సిఉంది. కానీ ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఏపీ టెట్ ఫలితాలు విడుదలకు బ్రేక్ పడింది. దీంతో ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయోనని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఫలితాలను బట్టీ డీఎస్సీకి ప్రిపేర్ అవ్వడంపై ఒక స్పష్టత వస్తుందని‌ భావిస్తున్నారు‌. 16వేలకు పైగా టీచర్ పోస్టులతో కూడిన దస్త్రంపై ఏపీ సీఎం చంద్రబాబు సంతకం చేసిన నేపథ్యంలో త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి విద్యాశాఖ కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.

Also Read: కొడాలి నానికి చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్..!

#ap-mega-dsc-notification #dsc-notification #ap #cm-chandrababu-naidu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe