TS DSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌!

తెలంగాణలో టీచర్ల రిక్రూట్‌మెంట్లకు సర్కార్‌ పచ్చజెండా ఊపింది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న నోటిఫికేషన్‌కి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకం జరుపుతున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ప్రకటించారు. మొత్తం 6,611 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.

TS Jobs : 9800 పోస్టులతో రేవంత్ సర్కార్ మెగా డీఎస్సీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
New Update

DSC job notification: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. తెలంగాణలో టీచర్ల రిక్రూట్‌మెంట్లకు రంగం సిద్ధమైంది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. విద్యాశాఖ మంద్రి సబితా ఇంద్రరెడ్డి (Sabitha Indra Reddy) కీలక ప్రకటన చేశారు. ఈ సారి TSPSC-TRT ద్వారా కాకుండా.. గతంలో లాగా డీఎస్సీ(DSC) ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 15న టెట్‌ పరీక్ష ఉంటుందని సబితా చెప్పారు. అదే నెల 27న ఫలితాలు విడుదల చేస్తారని సమాచారం.

నిజానికి గతంలో TSPSC ద్వారా టీచర్ల నియామకాలు జరిగేవి. అయితే సీఎం కేసీఆర్‌ (CM KCR) ఈసారి డీఎస్సీ ద్వారా రిక్రూట్‌మెంట్లకు ఆదేశించినట్టు సబితా చెప్పారు. దీనికి జిల్లా కలెక్టర్ల చైర్మన్‌గా ఉండనున్నారు.

సమీపిస్తోన్న ఎన్నికలు:
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిరుద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖకు వ్యతిరేకంగా నిరుద్యోగ అభ్యర్థులు ఇప్పటికే అనేకసార్లు నిరసనకు దిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు (Teacher Posts) ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం రిలీజ్ చేయబోతున్న నోటిఫికేషన్‌ ప్రకారం మొత్తం 6,611 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీ చేపట్టనుండడంపై అభ్యర్థుల నుంచి ఎలాంటి రియాక్షన్స్‌ వస్తాయో చూడాలి.. ఎందుకంటే 20వేలకు పైగా ఖాళీలున్నాయని సమాచారం. మరోవైపు వివిధ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామని సబితా స్పష్టం చేశారు. ఇంటర్‌, డిగ్రీ స్థాయిలో 3,140 పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని క్లారిటీ ఇచ్చారు.

Also Read: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? ఈ పది విషయాలు తెలుసుకోవల్సిందే..!!

#cm-kcr #telangana-dsc #tspsc #dsc-notification #dsc-job-notification #telangana-dsc-jobs #sabitha-indrareddy #ts-dsc-trt #teachers-recruitment #ts-dsc-notification-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe