TS DSC Notification 2023: తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్.. ఖాళీల వివరాలివే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నియామక పరీక్షను మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ , మెదక్, ఆదిలాబాద్ , కరీంనగర్ , నిజామాబాద్, వరంగల్, సంగారెడ్డి, ఖమ్మం , నల్గొండలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు వేతన పరిధి రూ. రూ. 24,600 నుంచి రూ. నెలకు 49,100 వరకు ఉంటుంది.