TG Jobs: డీఎస్సీ, గ్రూప్-2,3 వాయిదా పడుతుందా? ప్రభుత్వం, నిరుద్యోగుల వాదనలేంటి?

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియ, పరీక్షల నిర్వాహణ అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జులై 18నుంచి డీఎస్సీ, ఆగస్టు 7,8న గ్రూప్-2 పరీక్షలు జరగనుండగా వీటిని వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

TG Jobs: డీఎస్సీ, గ్రూప్-2,3 వాయిదా పడుతుందా? ప్రభుత్వం, నిరుద్యోగుల వాదనలేంటి?
New Update

Telangana: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలకు సంబంధించి వరుస వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ నిరుద్యోగం, నియామకాల అంశం ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. 2023లో మొత్తం 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2015 నుంచి 2022 వరకు 108 నోటిఫికేషన్లు విడుదల చేసి టీఎస్పీఎస్సీ ద్వారా 36,886 ఉద్యోగాలను భర్తీ చేసింది. అందులో కీలకమైన గ్రూప్‌-1 ఉద్యోగాలు 128, గ్రూప్‌-2 1,032, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ 1,058, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ 931 ఉద్యోగాలున్నాయి. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. బీఆర్ఎస్ హయాంలో టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం నియామకాల ప్రక్రియను కీలక మలుపు తిప్పింది. దీంతో 2023లో జరగాల్సిన గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈ, డీఏవో పరీక్షలను రద్దు చేయగా.. మరికొన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల హామీలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే టీజీ పీఎస్సీని ప్రక్షాళన చేసిన కాంగ్రెస్ గ్రూప్-4 పరీక్ష నిర్వహించి నియమాక ప్రక్రియ చేపట్టింది. ఆ తర్వాత మరిన్ని ఉద్యోగాలు పెంచి 536 పోస్టులకు జూన్ 9న గ్రూప్ -1 పరీక్ష నిర్వహించింది.

అక్టోబర్‌లో 25,000 పోస్టులతో మెగా డీఎస్సీ..

ఇదిలా ఉంటే.. డీఎస్సీ అంశం హాట్ టాపిక్ గా మారింది. గత పదేళ్లుగా టీచర్ అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 11,500 టీచర్ పోస్టులు భర్తీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కాంగ్రెస్ షెడ్యూల్ ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు, ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించాలని భావించింది. కానీ గత మూడు నెలలుగా వరుస పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఏక కాలంలో రెండు మూడు పరీక్షలు రాయలేకపోతున్నామంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఒకే తేదీల్లో పరీక్షలు నిర్వహించడం ద్వారా తాము నష్టపోతామని వాపోతున్నారు. డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు వెంటవెంటనే ఉండటంతో తాము రెండు పరీక్షలకు సన్నద్ధం కావడానికి వీలు పడటం లేదని చెబుతున్నారు. డీఎస్సీ పరీక్షను సెప్టెంబర్‌లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 2,3 పోస్టులు పెంచి, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగ జేఏసీ నేతలు కోరుతున్నారు. డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేసి అక్టోబర్‌లో 25,000 పోస్టులతో మెగా డీఎస్సీ పెట్టాలని, గ్రూప్ 1లో 1:100ను అమలుపరచాలంటూ నిరసనలు చేపడుతున్నారు.

జులై 11 నుంచి డీఎస్సీ హాల్‌టికెట్లు..

మరోవైపు విద్యాశాఖ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. డీఎస్సీ హాల్‌టికెట్లు జులై 11 సాయంత్రం నుంచి వెబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. ఇక జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని పలుమార్లు వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తం 2.79 లక్షల మంది అభ్యర్థులు ద‌రఖాస్తులు చేసుకున్నారు.

నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారంటున్న సీఎం..

ఇటీవల ఉద్యోగ నియమాకాల ప్రక్రియ, పరీక్షల వాయిదాపై స్పందించిన సీఎం రేవంత్.. రాజకీయ పార్టీలు చేస్తున్న స్వర్థపూరిత కుట్రలకు బలికావొద్దని నిరుద్యోగులకు సూచించారు. డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల తేదీలపై టీజీఎస్పీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అప్పటి వరకు కొంత ఓపిక పట్టాలని.. విపక్ష పార్టీల ఉచ్చులో పడొద్దని యువతకు పిలుపునిచ్చారు. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్లకే రెండేళ్ల నుంచి పరీక్షలు నిర్వహించలేదు. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదు. కానీ నిరుద్యోగులు మాత్రం తీవ్రంగా నష్టపోతారు. అలా జరగకూడదనేదే ప్రభుత్వ ఆలోచన అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 ఎగ్జామ్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఇది వరకే ఉత్తర్వులను సైతం జారీ చేసింది. అయితే నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో గ్రూప్-2, డీఎస్సీ పరీక్షల్లో ఏదో ఒకదాన్ని వాయిదా వేయాలని భావిస్తుండగా గ్రూప్-2 పరీక్షనే వాయిదా వేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.  ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ, రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇక అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీతోపాటు జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. సెప్టెంబరు 17లోపు నియామకాలు పూర్తి చేసి సెంట్రలైజ్డ్ ఆన్‌లైన్ రిజస్ర్టేషన్ పోర్టల్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. ప్రతి జిల్లాలో ఎంప్లాయిమెంట్ ఎక్చేంజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75శాతం ఉద్యోగాలతోపాటు వివిధ అంశాలతో డిక్లరేషన్ ప్రకటించింది.

#dsc #telangana #group-2 #tgpsc #cm-revant
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe