drone attacked on ship:అరేబియా సముద్రంలో నౌకపై డ్రోన్ దాడి

New Update
drone attacked on ship:అరేబియా సముద్రంలో నౌకపై డ్రోన్ దాడి

గుజరాత్ తీరంలో ఒక వ్యాపారనౌక మీద డ్రోన్ దాడి జరిగింది. ఇజ్రాయెల్ అనుబంధ సంస్థకు చెందినదిగా చెబుతున్నారు. దీని మీద లైబీరియా జెండా ఉంది. ఈ నౌకమీద గుర్తు తెలియని వ్యక్తు దాడి చేశారని మారిటైమ్ ఏజెన్సీ వెల్లడించింది. భారత్ లోని వెరావల్ తీరానికి నైరుతిదిశగా దాదాపు 200 కి.మీల దూరంలో ఈ ఘటన జరిగిందని మారిటైమ్ తెలిపింది. డ్రోన్ తో దాడి చేయడం వలన నౌకలోని రసాయన పదార్ధాలున్న ట్యాంకర్ పేలి అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఇందులో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. షిప్ లో కొంతమేర మాత్రం దెబ్బ తింది. డ్రోన్ దాడి సమాచారం అందుకున్న భారత నేవీ వెంటనే ఐసీజీఎస్ విక్రమ్ ను సహాయానికి పంపించింది.

Also Read:లీకయిన బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ యూజర్ల డేటా..జాగ్రత్త అంటున్న సైబర్ సెక్యూరిటీ

ఇజ్రాయెల్ అనుబంధ సంస్థకు చెందిన ఈ షిప్ పేరు ఎంవీ కెమ్ ఫ్లూటో. ఇదొక వాణిజ్య నౌక. ఇందులో 20 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఫ్లూటో షిప్ సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తున్నట్లు భారత నేవీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత ఎక్స్ క్లూజివ్ ఎకనమిక్ జోన్ బయట ఉన్న ఫ్లూటోకు సాయం చేసేందుకు భారత నేవీకి చెందిన యుద్ధనౌకలను పంపిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇప్పటివరకు దీని మీద ఎవరు దాడి చేశారన్న దాని గురించి మాత్రం తెలియలేదు. అలాగే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఎవరూ ఎలాంటి ప్రకటనలు కూడా చేయలేదు అని అధికారులు చెబుతున్నారు.

ఇజ్రాయెల్-హాస్ యుద్ధం మొదలైన తరువాత ఎర్రసముద్రంలో ఇరాన్ మద్దతున్న హౌతీ రెబెల్స్ వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తూనే ఉన్నారు. హౌతీ రెబెల్స్ హమాస్ కు మద్దులునిస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్ తో సంబంధమున్న నౌకల మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు