World Health Day: వేసవిలో శరీరం డీహైడ్రేట్‌ కాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి

వేసవి కాలంలో శరీరాన్ని డీహైడ్రేట్‌కు గురికాకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఇలా ఉండాలంటే మనం తాగే నీరు సరిపోదని.. రోజుకు కనీసం రెండు నుంచి నాలుగు లీటర్ల నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.

New Update
World Health Day: వేసవిలో శరీరం డీహైడ్రేట్‌ కాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి

ఎండకాలం మొదలైపోయింది. రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. వేసవి కాలంలో కొందరు నదులు, చెరువులు,బీచ్‌లోకి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇదే సమయంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల చెమట, దద్దుర్లు, నిరసం లాంటి వాటితో ఇబ్బందులు పడుతుంటారు. మరీ ముఖ్యంగా కొందరు వడదెబ్బకు గురవుతుంటారు. అందుకే వేసవిలో మన శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా.. హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే ఇలా ఉండాలంటే మనం తాగే నీరు సరిపోదని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజులో తగినన్ని నీళ్లు తీసుకోకుంటే.. మన శరీరంలోని పలు భాగాల పనితీరు మందగిస్తుందని చెబుతున్నారు. ఒక వ్యక్తి సగం బరువులో.. మూడింట రెండు వంతుల నీరు ఉంటుంది. ఒక 70 కిలోల వ్యక్తి శరీరంలో దాదాపు 42 లీటర్ల నీరు ఉంటుంది. అందుకే ఈ వేసవిలో శరీరానికి కూలింగ్ ఇచ్చే పండ్లరసాలు, ఆహారాన్ని తీసుకోవాలి.

Also Read: కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. కేసు కొట్టివేసిన కోర్టు

గురుగ్రామ్‌కు చెందిన డాక్టర్‌ తుషార్ తయాల్ మాట్లాడుతూ.. ' మన శరీరం నుంచి నీరు అనేది ప్రధానంగా కిడ్నీల నుంచి యూరీన్‌ ద్వార వెళ్లిపోతుంది. శరీర అవసరాన్ని బట్టి సాధారణంగా కిడ్నీల నుంచి రోజుకు 800 మి.లీ నుంచి 2 లీటర్ల యూరిన్ బయటికి వెళ్లిపోతుంది. కొన్నిసార్లు దీని మారుతూ ఉంటుంది.  అలాగే ప్రతిరోజు ఊపిరితిత్తులు.. చర్మం నుంచి ఆవిరయ్యే నీటి ఆవిరిని బయటికి వదులుతాయి. దీనివల్ల 750 మి.లీ నీరు బయటికి పోతుంది. ఎక్కువగా చెమట రావడం పట్టినప్పుడు కూడా ఆవిరి వల్ల చాలావరకు నీటిని కోల్పోతారు. ఎక్కువగా వ్యాయామం చేసినప్పుడు, వేడి వాతావరణం ఉన్నప్పుడు అలాగే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. అందుకే ఈ వేసవిలో పెద్దవారు రోజుకు రెండు లీటర్ల నీరు తాగాలి' అని తెలిపారు.

మరోవైపు జాహ్నవీ అగర్వార్‌ అనే ఓ న్యూట్రీషియన్‌ కన్సల్టంట్.. వేసవిలో శరీరం డీహైడ్రైట్‌కు గురికాకుండా జాగ్రత్తపడాలని చెబుతున్నారు. ఇందుకోసం మనం ఎలాంటి నియమాలు పాటించాలో సూచనలు చేశారు.

1. ఎలక్ట్రోలైట్‌ అధికంగా ఉండే కొబ్బరి నీరును తాగాలి.

2. మజ్జిగ, ప్రోబయోటిక్స్, పండ్ల జూస్ తీసుకోవాలి

3. నిమ్మరసం తాగాలి

4. పులియబెట్టిన కంజీ పానీయాలు అనేవి ప్రోబయోటిక్స్ , ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి

5. ఎలక్ట్రోలైట్ సప్లిమెంట్లు అనేవి శరీరాన్ని డీహైడ్రేటెడ్ గా ఉంచుతాయి

Also Read: BRS మళ్లీ TRSగా.. కేసీఆర్‌ సంచలన నిర్ణయం !

Advertisment
Advertisment
తాజా కథనాలు