Alert : హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యగమనిక. మహానగరానికి ఒకరోజు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి అలర్ట్ జారీ చేసింది. సింగూరు ప్రాజెక్టులోని పెద్దాపూర్ పంప్ హౌజ్ దగరున్న 132కేవీ కంది పెద్దాపూర్ ఫీడర్ లో టీఎస్పీడీసీఎల్ పలు కరెంటు పనులు చేపట్టింది. దీంతో 22వ తేదీన ఉదయం 8గంటల నుంచికొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరాలో అంతరాయం వాటిల్లనుంది.
నీటి సరఫరాలో అంతరాయం వాటిల్లే ప్రాంతాలు:
ఓ అండ్ ఎం డివిజన్ -3 షేక్ పేట రిజర్వాయర్, భోజగుట్ట
ఓ అండ్ ఎం డివిజన్ -6: బంజార, ఎర్రగడ్డ రిజర్వాయర్ల ప్రాంతాల్లో పాక్షికంగా నీటి సరఫరా బంద్. బోరబండ రిజర్వాయర్ ప్రాంతాల్లో పూర్తిగా బంద్ కానుంది.
-ఓ అండ్ ఎం డివిజన్ -9అండ్ 15: లింగంపల్లి రిజర్వాయర్ ప్రాంతాల్లో, ఆన్ లైన్ సప్లయ్ పూర్తిగా నీటిసరఫరా బంద్ కానుంది.
-ఓ అండ్ ఎం డివిజన్ -18: ఖానాపూర్ గ్రావిటీ 1200 ఎంఎం మెయిన్ ఆన్ లైన్ సప్లయ్ ప్రాంతాల్లో పూర్తిగా సరఫరా నిలిచిపోనుంది.
పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి కోరింది. పనులు పూర్తయిన తర్వాత నీటిని సరఫరా యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది.
ఇది కూడా చదవండి: వందకు పైగా కంపెనీలు..5వేలకు పైగా ఉద్యోగాలు..నల్లగొండలో మెగా జాబ్ మేళా..!!