Drinking Milk: పాలు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదా?

పాలు ఎక్కువగా తాగితే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా పాలు తాగితే జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు, కడుపులో తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల బరువు అధికంగా పెరుగుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

New Update
Drinking Milk: పాలు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదా?

Drinking Milk: పాలు ఆరోగ్యానికి మంచివే అయినా ఎక్కువగా తాగితే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా పోషకాలు అధికంగా ఉండే పాలు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు.పాలలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఎముకలకు కూడా ఎంతో బలం. కానీ పాలను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

పేగుల ఆరోగ్యానికి మంచిది కాదు:

  • ఎక్కువ గా పాలు తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు, కడుపులో తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. లాక్టోస్ ఎక్కువగా ఉన్నవారు ఎక్కువగా పాలు తాగితే అందులో ఉండే లాక్టోస్‌ కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

అలెర్జీ:

  • పాలు ఎక్కువగా తాగితే అలర్జీ సమస్యలు వస్తాయి. కొందరికి పాలు అంటేనే అలర్జీ ఉంటుంది. ఎక్కువగా పాలు తాగడం వల్ల అలర్జీలతో పాటు జీర్ణ సమస్యలు కూడా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

బరువు పెరుగుతారు:

  • పాలలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొవ్వు పదార్ధాల నుండి వచ్చే కేలరీలను కూడా కలిగి ఉంటాయి. ఎక్కువగా పాలు తాగితే అధిక కాలరీలు మన శరీరంలోకి చేరుతాయి. దీనివల్ల బరువు అధికంగా పెరుగుతాయని వైద్య నిపుణులు అంటున్నారు.

పోషక అసమతుల్యత:

  • పాలలో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆహారంలో పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. పాలు ఎక్కువగా తాగితే శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కాల్షియం, విటమిన్ డి వస్తుంది. ఈ పోషకాలు అధికంగా చేరడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు, మృదు కణజాలాలలో కాల్షియం నిల్వలు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: సిగరెట్ వల్ల మీ పెదాలు నల్లగా మారాయా?..ఈ సమస్యలు తప్పవు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఇనుప వస్తువుల తుప్పు ఇలా వదిలించేయవచ్చు..మళ్ళీ కొత్తగా అయిపోతాయి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు