Uttarakahnd:ఉత్తరాఖండ్ సొరంగంలో మళ్ళీ ఆగిన డ్రిల్లింగ్ పనులు

ఇంకొంచెం దూరమే...అంతా అయిపోతుంది కార్మికులు బయటకు వచ్చేస్తారు అనుకున్నారు. కానీ అనుకోని అవాంతరం వచ్చి ఉత్తరాఖండ్ సిల్ క్యారా టన్నెల్ డ్రిల్లింగ్ పనులు మళ్ళీ ఆగిపోయాయి. 25 టన్నుల బరువైన డ్రిల్లింగ్ మెషీన్ను అమర్చిన వేదికకు పగుళ్ళు రావడంతో పనులను ఆపేశారు.

Uttarakahnd:ఉత్తరాఖండ్ సొరంగంలో మళ్ళీ ఆగిన డ్రిల్లింగ్ పనులు
New Update

ఈరోజు ఉదయానికి అన్నీ అనుకున్నట్టే సవ్యంగా అయిపోవాలి. మరికొన్ని గంటలు లేదా రేపు ఉదయానికి కార్మికులు వచ్చేస్తారు అని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ నిన్న సాయంకాలం అనౌన్స్ కూడా చేశారు. కానీ అది జరగలేదు. దేనితో అయితే సొరంగాన్ని తవ్వుతున్నారో దానికే ప్రాబ్లెమ్ రావడంతో డ్రిల్లింగ్ పనులను ఎక్కడిక్కడే ఆపేశారు. 25 టన్నుల బరువైన భారీ డ్రిల్లింగ్‌ మెషీన్‌ అమర్చిన వేదికకు పగుళ్లు రావడంతో డ్రిల్లింగ్‌ను ఆపేశారు. వేదిక సరిగా లేకుంటే డ్రిల్లింగ్‌ మెషీన్‌ అటుఇటూ కదులుతూ కచ్చితమైన దిశలో డ్రిల్లింగ్‌ అవదు. ఎలా పెడితే అలా డ్రిల్లింగ్ చేస్తే అసలుకే మోసమొస్తుంది. అందుకే ముందుజాగ్రత్తగా డ్రిల్లింగ్‌ను ఆపేశారు.

Also read:హైకోర్టులో నేడు బర్రెలక్క పిటిషన్ మీద విచారణ

ఇప్పుడు మేము చేస్తున్నది యుద్ధం లాంటిది అంటున్నారు లెఫ్టినెంట్‌ జనరల్‌ సయ్యద్‌ అతా హస్నయిన్‌. ఈ టైమ్ కల్లా కార్మికులను బయటకు కచ్చితంగా తీసుకువచ్చేస్తామని చెప్పడం సాధ్యం కాదు అంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ మొత్తం అంతా సొరంగం దగ్గరే ఉన్నారని...లోపలున్న కార్మికులను ఎలా బయటకు తీసుకురావాలో రిహార్సల్స్ చేస్తున్నారని చెబుతున్నారు. డ్రిల్లింగ్ ఆగిపోయిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశామని అంటున్నారు. దీని కోసం మరికొన్ని మెషీన్స్ ను తెప్పించామని సయ్యద్ తెలిపారు. బార్కోట్‌ వైపు నుంచి డ్రిల్లింగ్‌ పనులను 9.10 మీటర్ల మేర పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

#uttarakhand #workers #tunnel #drilling
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe