Dosa : ఈ పాన్‌ కేక్..టేస్ట్‌కి బాప్..హెల్త్‌కి టాప్.. అందుకే టాప్‌టెన్ లిస్ట్‌లో ప్లేస్

దోస తినటం వలన బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. ఒక సాదా దోసెలో 37 కేలరీలు ఉంటాయి. దీనిని ఉత్తమ పాన్‌కేక్‌ల జాబితాలో దోస 10వ స్థానంతోపాటు దీనికి 4.4 రేటింగ్‌ కూడా వచ్చింది. మసాలా దోసలో ఉండే ప్రోటీన్ జుట్టు, ఎముకలు, కండరాలకు మేలు చేస్తుంది.

Dosa : ఈ పాన్‌ కేక్..టేస్ట్‌కి బాప్..హెల్త్‌కి టాప్.. అందుకే టాప్‌టెన్ లిస్ట్‌లో ప్లేస్
New Update

Pan Cake Dosa : సౌత్ ఇండియన్ డిష్ దోస(South Indian Dish Dosa) ఎంత రుచిగా ఉంటుందో అంతే ఆరోగ్యకరం. ఇది లెక్కలేనన్ని ప్రయోజనాలను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచమంతా ఈ వంటకం పట్ల పిచ్చిగా ఉండడానికి ఇదే కారణమని అంటున్నారు. దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. తాజాగా ఈ వంటకం ప్రపంచంలోని టాప్ 10 పాన్‌కేక్‌(Top 10 Pan Cake) ల జాబితాలో చెరింది. టేస్ట్ అట్లాస్ 50 ఉత్తమ పాన్‌కేక్‌ల జాబితాలో దోస 10వ స్థానంలో ఉంది. దీనికి 4.4 రేటింగ్‌ కూడా వచ్చింది. దోస ఎందుకు అంతగా ఇష్టపడుతారో ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం.

బరువుకు చెక్: దోస తినటం వలన బరువు తగ్గుతారు(Weight Loss). ఒక సాదా దోసెలో 37 కేలరీలు ఉంటాయి. మసాలా దోసలో కేలరీలు కొంచెం ఎక్కువ. అందువల్ల ఇది ఇతర అధిక కేలరీల ఆహారాల కంటే మెరుగైనదని చెబుతున్నారు. దోసె తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

ప్రోటీన్: మసాలా దోస(Masala Dosa) లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా ముఖ్యమైనది. అంతేకాదు ఇది జుట్టు, ఎముకలు, కండరాలకు చాలా అవసరం. మసాలా దోస తినడం వల్ల ప్రొటీన్లకు మేలు జరుగుతుంది.

చక్కెరస్థాయి తగ్గుతుంది: దోసలో ఉండే ప్రోటీన్ చక్కెర రోగులకు మేలు చేస్తుంది. ఇది తిన్నాక చాలా సేపు పొట్ట నిండుగా, చక్కెరను తినకుండా కూడా ఆపుతుంది. దోస తింటే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

కార్బోహైడ్రేట్లు: మసాలా దోసలో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఆహారంలో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను కూడా చేర్చాలనుకుంటే, మసాలా దోస ఉత్తమమైనది. ఇది శరీరానికి శక్తితోపాటు అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

ఖనిజాలు సమృద్ధి: మసాలా దోస రుచి, ఆరోగ్యానికి గొప్ప మూలం. దీనివల్ల శరీరానికి అనేక రకాల ఖనిజాలు అందుతాయి. పనీర్, ఉల్లిపాయ, బచ్చలికూర, క్యారెట్, తక్కువ కొవ్వు చీజ్, టోఫు, ఓట్స్ దోస పిండిలో కలుపుతారు. ఇది శరీరానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుందని వైద్యులు చెబుతున్నారు .

ఇది కూడా చదవండి: మొఘల్ సామ్రాజ్యంలో యోధుల హెల్త్ సీక్రెట్ ఈ రోటీ..టేస్ట్‌తో పాటు హెల్త్ గ్యారెంటీ!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #weight-loss #top-10 #pan-cake-dosa #masala-dosa
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe