Komati Reddy Venkat Reddy: కాంగ్రెస్ 50 ఏళ్లలో ఏం చేసిందో తెలియదా..?

సీఎం కేసీఆర్‌పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రామలు చేపట్టలేదనడం సిగ్గు చేటన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేసిందో కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ సీఎం అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు.

Komati Reddy Venkat Reddy: కాంగ్రెస్ 50 ఏళ్లలో ఏం చేసిందో తెలియదా..?
New Update

సీఎం కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమి చేయాలేదన్న కేసీఆర్‌.. కాంగ్రెస్‌ ఏం చేసిందో తెలియదా అని ప్రశ్నించారు. కర్ణాటకలో పర్యటిస్తున్న కోమటిరెడ్డి అక్కడ బొగ్గు, ఉక్కు ఆధారిత పరిశోధన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్‌లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎంపై ధ్వజమెత్తారు. కేసీఆర్‌ రాజకీయ ప్రస్తానం మొదలైందే కాంగ్రెస్‌లో అని ఎంపీ గుర్తు చేశారు. కేసీఆర్‌ సీఎం అవ్వడానికి కారణం కాంగ్రెస్‌ పార్టీనే అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకపోతే కేసీఆర్‌ అనే వ్యక్తి ఎక్కడ ఉండేవాడని కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఆసియా ఖండంలోని అతి పెద్ద ప్రాజెక్టుగా పేరుగాయించిన నాగార్జున సాగర్‌ను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అన్నారు. శ్రీశైలం, కల్వకుర్తి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అన్నారు. 50 ఏళ్లలో కాంగ్రెస్‌ పార్టీ ఎంతో అభివృద్ధి చేసిందని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో 1వ తేదీకల్లా ఉద్యోగులకు జీతాలు డేవని, పెన్షన్‌లు ఇచ్చేవారిమని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం 15వ తేదీ దాటినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతోందని విమర్శించారు. కేసీఆర్‌ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను తాను నిర్మించినట్లు గొప్పలు చెబుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కేసీఆర్‌ ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం బాత్‌ రూమ్‌లు కూడా కట్టించలేక పోయారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ప్రభుత్వ ప్రొఫెసర్లు లేరన్న ఆయన.. కనీసం కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి తీసుకెళ్లిన కేసీఆర్‌కు కాంగ్రెస్‌ను ప్రశ్నించే అర్హత లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 32 లక్షల ఇళ్లు నిర్మించిందన్నారు. కానీ కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూమ్‌తో ఇళ్లతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాగా ప్రతీ ఒక్కరు ఓటు వేసే ముందు 9 ఏళ్లలో కేసీఆర్‌ రాష్ట్రానికి ఏం చేశారో ఆలోచించి వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సూచించారు.

#kcr #telangana #nagarjuna-sagar #komati-reddy-venkat-reddy #development #srisailam-project
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe