Janasena Leader Pawan Kalyan Decision : ఎన్నికలు సమీపిస్తున్న వేళలోల పార్టీలకు భారీగా విరాళాలు వస్తున్నాయి. సీట్లు కావాలని... ఇంకేదో అని చాలా మంది పార్టీలకు ఫండ్స్ పంపిస్తారు. ఆంధ్రాలో జనసేన పార్టీ(Janasena Party) కి కూడా భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి. అయితే వీటి మీద జనసేనాని ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి వచ్చిన ఫండ్స్ అన్నీ తిరిగి ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారు. కొందరు నాయకులు పార్టీకి విరాళం ఇచ్చి సీట్లు కావాలని ఒత్తిడి చేస్తున్నారని.. అలాంటి వారి విరాళాలు వెనక్కిచ్చేయని ఆదేశించారు. నాయకుని ఆదేశంతో విరాళాలన్నీ వెనక్కు ఇచ్చేస్తున్నారు జన సేన నేతలు. గోదావరి జిల్లాల్లోని(Godavari District) కొందరు నాయకులకు చెక్కులు తిరిగి ఇచ్చేశారు.
Also Read : International:ఆస్ట్రేలియా పార్లమెంటులో భగవద్గీత మీద ప్రమాణం చేసిన సెనెటర్
కష్టపడేవారికే సీట్లు..
దీంతో పాటూ పార్టీ కోసం నిస్వార్ధంగా పని చేసి, కష్టపడిన వారికే టికెట్లు ఇవ్వాలని పవన్ కల్యాణ్(Pawan Kalyan) నిర్ణయం తీసుకున్నారు. టికెట్ల కోసం ఆశపడి ఇచ్చే విరాళాలు తీసుకోవద్దని పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఎవరైనా స్వచ్చంధంగా విరాళాలు ఇస్తే మాత్రం తీసుకోవాలని సూచించారు. ఇకపై చెక్కులు తీసుకోకూడదని.. కేవలం స్కాన్ ద్వారానే విరాళం తీసుకోవాలని ఆదేశించారు.
సీట్ల సర్దుబాటులో తేలని లెక్కలు..
మరోవైపు టీడీపీ(TDP), జనసేన మధ్య సీట్ల లెక్క తేలడం లేదు. చంద్రబాబు, పవన్ ఓకే అనుకున్నా గ్రౌండ్ లెవల్‌లో తీవ్ర పోటీ నెలకొంది. దాదాపు 35 నుంచి 40 సీట్లలో టీడీపీ, జనసేన మధ్య పోటీ ఉంది. తామే పోటీ చేస్తామని ఇరు పార్టీ నేతల పట్టు పడుతున్నారు. దాంతో పాటూ పవన్ పార్టీకి 25 అసెంబ్లీ సీట్లు, మూడు లోక్ సభ సీట్లు కేటాయించాలని టీడీపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెల చంద్రబాబు, పవన్ ఈ రెండు అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించారు. అరకు, మండపేట నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు ఖరారు చేయడంతో రాజానగరం, రాజోలు నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. దీంతో ఇరు పార్టీల మధ్య చిచ్చు రేగింది.