Skin Care: వంటగదిలో ఉండే వీటిని ముఖంపై పూయకండి.. మీ చర్మం పాడవుతుంది!

చర్మ సంరక్షణ విషయానికి వస్తే అందంగా, ఆకర్షణీయం కోసం కొన్ని హోం రెమెడీస్‌కి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. శనగపిండి, టొమాటో, వాల్నట్ స్క్రబ్, నిమ్మ, నారింజ,ఆపిల్ వెనిగర్ వంటివి ముఖానికి వాడితే చర్మానికి చాలా కష్టంగా ఉంటుంది.

Skin Care: వంటగదిలో ఉండే వీటిని ముఖంపై పూయకండి.. మీ చర్మం పాడవుతుంది!
New Update

Skin Care: చర్మ సంరక్షణ విషయానికి వస్తే అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. ప్రస్తుతకాలంలో ఇది సాధ్యపడిని విషయం. అయితే కొంతమంది చర్మం కోసం ఇంటి చిట్కాలు పాటిస్తారు. చర్మానికి కొన్ని హోం రెమెడీస్‌ తీసుకుంటే మాత్ర సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులంటున్నారు. అందమైన చర్మం కావాలనే కోరికతో ఇంటి నివారణలు, కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్‌ వాడేస్తారు. అయితే.. కొన్ని హోం రెమెడీస్‌ను పాటించాలని సూచించినప్పటికీ..కొన్ని రకాల రెమెడీలకు ఎలాంటి ఆధారం, ఎలాంటి శాస్త్రీయ పరిశోధన, గ్యారెంటీ లేదు. చర్మం ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. అందుకని వాటిని వాడిస్తే చర్మానికి హానికరమని చర్మవ్యాధి  నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో చర్మం దెబ్బతింటుంది. హోం రెమెడీస్ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శనగపిండి:

  • సూర్యకాంతి వల్ల చర్మం చాలా టాన్ అవుతుంది. టానింగ్‌ను పోవాటానికి కొందరూ శనగ పిండితో స్క్రబ్బింగ్ చేస్తారు. అయితే.. శనగపిండి చర్మాన్ని చికాకుపెడుతుంది.టాన్ చేసిన చర్మంపై శనగ పిండిని వాడొద్దు.

టొమాటో:

  • టానింగ్‌ను తొలగించడానికి టొమాటోను వాడుతారు. ఇందులో లైకోపీన్,యాంటీఆక్సిడెంట్ ముఖానికి అప్లై చేసిన తర్వాత చర్మంపై చికాకు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.

వాల్నట్ స్క్రబ్:

  • స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్ కోసం వాల్‌నట్ స్క్రబ్‌ను వాడుతారు. ఇలా చేస్తే ముఖం నియంత్రణను పాడు చేస్తుంది. దీని కణాలు చర్మానికి చాలా కష్టంగా ఉంటుంది. కావునా.. ముఖాన్ని శుభ్రం చేయడానికి, చర్మం దురదగా, సెన్సిటివ్ గా ఉంటే వాటికి దూరంగా ఉండాలి. దీనికి బదులు వాల్‌నట్ స్క్రబ్‌కు బదులుగా పెరుగును ఉపయోగించవచ్చని నిపుణుల చెబుతున్నారు. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మానికి హాని కలగకుండా ఎక్స్‌ఫోలియేషన్‌లో సహాయపడుతుంది.

నిమ్మ, నారింజతో గ్లో:

  • చర్మం గ్లో పెరగడానికి నిమ్మ, నారింజను ఉపయోగించ కూడదు.ఈ రెండు విషయాలు చర్మంపై తీవ్రమైన చికాకును కలిగిస్తాయి. నిమ్మకాయ కాంతి సున్నితత్వాన్ని కూడా పెంచుతుంది. సూర్య రశ్మికి గురైనప్పుడు చర్మం నల్లబడుతుంది. మెరిసే చర్మం కోసం నియాసినామైడ్ లేదా విటమిన్ సి సీరమ్ వాడాలి. ఇది  చర్మం ఛాయను మెరుగుపరుస్తుంది.

ఆపిల్ వెనిగర్:

  • ఆపిల్ వెనిగర్‌ని ముఖంపై దీనిని ఉపయోగించడం మానుకోవాలి. ఇది చర్మానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇది కూడా చికాకు కలిగించవచ్చు. దీనికి బదులుగా ప్రత్యామ్నాయంగా లాక్టిక్ యాసిడ్ సీరమ్ చర్మంపై అప్లై చేసుకోవచ్చు.ఇది చర్మం పొడిబారకుండా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. దాని సహాయంతో ఇది మొటిమల మచ్చలకు తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: జిడ్డు చర్మానికి చెక్..ఇది వాడి చూడండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#skin-care #health-benefits #kitchen #face #damage-skin
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe