USA: సెప్టెంబర్‌‌లో కమలా హారిస్, ట్రంప్ మధ్య డిబేట్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్ధిగా కమలా హారిస్ ఖరారు అయ్యారు. ఇప్పుడు ట్రంప్, కమలాల మధ్య పోటీ మరింత ఆసక్తిగా మారింది. దీంతో కమలా హారిస్‌తో డిబేట్‌కు ట్రంప్ ఒప్పుకున్నారు. వీరిద్దరి మధ్యా సెప్టెంబర్‌‌లో డిబేట్ జరగనుంది.

New Update
USA: 231 మిలియన్ డాలర్ల విరాళాలు..దూసుకుపోతున్న కమలా హారిస్

Kamala Harris-Trump Debate : నవంబర్‌‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి సమీకరణాలు ఒక్కసారిఆ మారిపోయాయి. దానికి కారణం డెమోక్రటిక్ పార్టీ తరుఫు నుంచి బైడన్ తప్పుకుని కమలా హారిస్ పోటీలోకి రావడమే. ఇండియన్ మూలాలున్న కమలా పోటీలోకి రాగానే ఇద్దరి మధ్యా పోటీ మరింత ఆసక్తిగా మారింది. దీంతో డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థికా ఖరారైన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో డిబేట్ జరిపేందుకు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. కమలా హారిస్‌తో డిబేట్‌కు తాను సిద్ధమేనని ట్రంప్ ప్రకటించారు. వీరిద్దరి మధ్యా డిబేట్ సెప్టెంబర్లో జరగనుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ట్రూత్‌ సోషల్‌ మీడియా అకౌంట్‌లో డొనాల్డ్ ట్రంప్‌ తాజాగా వెల్లడించారు.

సెప్టెంబరు 4 వ తేదీన ఫాక్స్‌ న్యూస్‌ నిర్వహించనున్న ఈవెంట్‌లో డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో దిగుతున్న కమలా హారిస్‌తో ఫేస్ టు ఫేస్ డిబేట్‌ జరిపేందుకు అంగీకరించినట్లు ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ చెప్పారు. నిజానికి ఇదే సెప్టెంబర్ 4 వ తేదీన ఏబీసీ ఛానల్‌ నిర్వహించే డిబేట్‌లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌తో ట్రంప్ డిబేట్ ఉండాల్సి ఉంది. ఇప్పుడు ఆయన పోటీలో లేరు కాబట్టి అది రద్దు అయింది.

ఈ ఫాక్స్ న్యూస్ నిర్వహించే డిబేట్ పెన్సిల్వేనియాలో జరగనుంది. ఎప్పటిలాగే అన్ని రూల్స్ ఈ డిబేట్‌కు వర్తిస్తాయని తెలిపారు. అయితే ఈ డిబేట్ గురించి కమలా హారిస్ ఇంకా స్పందించలేదు. ఫేస్ టూ ఏస్‌కు మలా హారిస్ సిద్ధమేనని ఇప్పటికే ప్రకటించారు. ఇక మలా హారిస్‌, డొనాల్డ్ ట్రంప్‌ మధ్య ఈ డిబేట్ జరిగితే.. అది ఈ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరగనున్న రెండో ముఖాముఖి చర్చ కానుంది. జూన్‌లో తొలిసారి జో బైడెన్‌, డొనాల్డ్ ట్రంప్‌ మధ్య తొలి డిబేట్‌ జరిగింది.

Also Read:Madhya Pradesh: చిన్నారులపై పడిన గోడ..నలుగురు మృతి

Advertisment
తాజా కథనాలు