Dokka MVP : దురాశ దుఃఖానికి చేటు.. నేను టీడీపీ అధిష్టానానికి కట్టుబడి పనిచేస్తా!

వైసీపీతో తనకు బంధం పూర్తిగా తెగిపోయిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. టీడీపీ అధిష్ఠానం చంద్రబాబు, లోకేష్ ఎక్కడ పని చెయ్యమంటే అక్కడ చేస్తానని చెప్పారు. దురాశ దుఃఖానికి చేటు అన్నట్లు జగన్ తో తన ప్రయాణం నిరాశపరిచిందన్నారు.

author-image
By srinivas
New Update
Dokka MVP : దురాశ దుఃఖానికి చేటు.. నేను టీడీపీ అధిష్టానానికి కట్టుబడి పనిచేస్తా!

AP News : మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్(Dokka Manikya Vara Prasad) టీడీపీ(TDP) వీడట్లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో తనకు మంచి అనుబంధం ఉందని, ఎప్పటికైనా టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. అలాగే జగన్ తో తనకు దోస్తీ కుదరదంటూ సామెతలు వేశారు. వెనకటి కి ఒక సామెత వుంది. దురాశ దుఃఖానికి చేటు అన్నట్లు తాను జగన్ తో ప్రయాణం బాగుంటుందనుకున్నప్పటికీ అది నిరాశ కలిగించిందని చెప్పాడు. 4 ఏళ్ల పాటు జగన్ తో నడిచాను. అలాగే టీడీపీలో వున్నపుడు ఎమ్మెల్సీగా వున్నాను. వైసీపీ(YCP) కి వెళ్లిన తరువాత కుడా నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు. శ్రీదేవిని సమన్వయ కర్తగా ఎందుకు తీసేసారో నాకు తెలియదని చెప్పారు.

నియమించి తొలగించడం బాధకరం..
అలాగే పరిస్థితులు చక్కబెట్టుకుంటే బాగుండేదని, అలా చెయ్యకుండా నన్ను సమన్వయ కర్తగా నియమించి తొలగించడం బాధకరమన్నారు. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వున్నాయి. తాడికొండ నియోజకవర్గంతో నాకు బాగా పరిచయాలు వున్నాయి. సమాజంలో నాకు గౌరవం వుంటుంది. దాన్ని నేను కాపాడుకోవాలి. చాలా అవమానంగా ఫీల్ అయ్యాను, ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి పార్టీలో గుర్తింపు కోల్పోయాను. పూర్తిగా రాజకీయాల్లో సేవ చేసేవాడిని. నాకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా మానసికంగా నన్ను కృగందీసారు. ఒక్కసారి అయినా జగన్ ను కలిసే అవకాశం కల్పించలేదు. తప్పని పరిస్తితుల్లో సిగ్గు కోల్పోయి పార్టీని వీడాను. ఎస్సీలు అంటే ఊరికే తిట్టడానికి ఉన్నారా? మాకు ఇచ్చే స్పేస్ మాకు ఇవ్వాలి తిట్టే వాళ్ళు వుంటారు తిట్టని వాళ్ళు వుంటారు. సజ్జల కూడా నన్ను తీవ్రంగా అవమానిoచారు. జగన్ నెలకు ఒక సారి ఎమ్మెల్యే ని కలిసే అవకాశం ఇస్తానని మానిఫెస్టోలో పెట్టాలి. కార్యకర్తలను కలిసే అవకాశం ఇవ్వాలి. అమరావతికి నేను కట్టుబడి వుంటానన్నారు.

ఇది కూడా చదవండి: Kishan reddy: నీకు దమ్ముంటే ఆ పని చేయ్.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్!

ఇక టీడీపీకి రాజీనామా చేసే నాటికి మూడు రాజధానులు ప్రపోజల్ వచ్చిందని చెప్పారు. నా పాత క్లిపింగ్స్ అన్నీ చూసుకోండి మూడు రాజధానులకు నేను సపోర్ట్ చేసి మాట్లాడలేదు. రైతు అనే వాడు నష్టపోకుండా ఉండాలి. అమరావతి రైతులకు నేను అండగా ఉంటాను. చంద్రబాబునాయుడు, లోకేష్ నన్ను ఎక్కడ పని చెయ్యమంటే అక్కడ పనిచేస్తాని తన మనసులో మాట బటయపెట్టాడు.

Advertisment
తాజా కథనాలు