Heart Attack: ఇలా చేస్తే గుండెపోటు నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవచ్చు అధిక ఆందోళన, ఒత్తిడి నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది. చెడు అలవాట్లు గుండెపోటుతో పాటు అనేక వ్యాధులు వచ్చే అవకాశాలను మరింత పెంచుతున్నట్టు వైద్యులు అంటున్నారు. గుండె సమస్యల నుంచి ఎలా కాపాడుకోవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్ళండి By Vijaya Nimma 20 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Heart Attack: ఈ రోజుల్లో గుండెపోటు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఏ వ్యక్తికైనా ఎప్పుడైనా గుండెపోటు రావొచ్చు. శరీరంలో గుండె చాలా ముఖ్యమైన భాగం కాబట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవడం అంతే ముఖ్యం. ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్నవయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. 30 నుంచి 35 ఏళ్ల వయసులో గుండెపోటుతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని విషయాలను గుర్తుంచుకుంటే గుండెపోటు బారి నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గుండెపోటు నుంచి బయటపడేందుకు చాలా మంది శక్తివంతమైన పౌడర్లు, క్యాప్సూల్స్, మందులను వేసుకుంటున్నారు. ఇది కొన్నిసార్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటుకు కారణాలు: ఒకప్పుడు గుండెపోటు అనేది వృద్ధులలో ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అది సాధారణం అయిపోయింది. దీనికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తప్పుడు ఆహారపు అలవాట్లు, బిజీ లైఫ్ కారణంగా శరీరంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. దీంతో ఆరోగ్యం దెబ్బతింటోంది. ఊబకాయం కారణంగా గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. కొన్నిసార్లు అధిక ఆందోళన, ఒత్తిడి నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది. ఈ చెడు అలవాట్లు గుండెపోటుతో పాటు అనేక వ్యాధులు వచ్చే అవకాశాలను మరింత పెంచుతున్నట్టు వైద్యులు అంటున్నారు. ఈ విషయాలను గుర్తుంచుకోండి: గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో పండ్లు, కూరగాయలు, ధాన్యాలను చేర్చుకోవాలి. పని చేయడానికి ముందు రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. వారానికి కనీసం 2 రోజులు కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడూ బరువును నియంత్రించాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. పొగతాగడం, మద్యం సేవించడం వంటివి చేయకూడదు. రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: మీ భాగస్వామి మీకు సరైందో కాదో ఇలా తెలుసుకోండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #heart-attack #health-benefits #health-care #best-health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి