రాత్రిపూట ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్టట్లే..!! రాత్రిపూట కొన్ని పనులు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ ప్రభావం నిద్రమీద పడే ఛాన్స్ ఉంటుంది. కాఫీ తాగడం, చాక్లెట్లు తినడం, మొబైల్ చూడటం, ఎక్కువగా నీళ్లు తాగడం, ఆల్కాహాల్, గొడవలు వీటన్నింటికి దూరంగా ఉంటే మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. లేదంటే నిద్రలేని రాత్రుళ్లు గడపాల్సిందే. By Bhoomi 14 Nov 2023 in లైఫ్ స్టైల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు అస్సలు చేయకపోవడమే మంచిది. ఒకవేళ పొరపాటునా ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఆ ప్రభావం మీ నిద్రపై పడే ఛాన్స్ ఉంది. ఎలాంటి పనులు రాత్రి పూట చేయకూడదో ఓసారి తెలుసుకుందాం. వ్యాయామం: రాత్రిపూట కొంతమందికి వ్యాయామం చేసే అలవాటు ఉంటుంది. దానిని మానుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దాని వల్ల శరీరం ఉత్తేజితమై నిద్రకు ఆటంకం కలుగుతుంది. తిన్న వెంటనే అస్సలు పడుకోకూడదు. ఇలా చేస్తే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాఫీ, చాక్లెట్లు: నిద్రించే రెండు లేదా మూడు గంటల ముందు కాఫీ అస్సలు తాగకూడదు. వీటిల్లో కెఫీన్ ఉంటుంది. అందుకే రాత్రి వేళలలో కాఫీ, చాక్లెట్లు తినకూడదని చెబుతుంటారు. అప్పుడే నిద్ర బాగా పట్టే చాన్స్ ఉంటుంది. ఈ మెయిల్స్ చెక్ చేయడం: ఇంకా నిద్రపోవడానికి ముందు ఈమెయిల్స్ చెక్ చేసుకోవడం లాంటివి చేయకూడదు. ఇలా చేస్తే మీ మైండ్ పై ప్రభావం పడుతుంది. ఒకవేళ ఈమెయిల్ లో మీరు పరిష్కరించలేని పని ఉంటే దాని గురించి ఆలోచిస్తూ రాత్రి మెలుకవ ఉండాల్సి వస్తుంది. అందుకే ఆఫీస్ పనులు ఇంటికి వచ్చిన తర్వాత వాటికి దూరంగా ఉండాలి. నీరు తాగడం: రాత్రి పూట నీరు తాగే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. నిద్రించే ముందు నీరు తాగకూడదు. అప్పుడు మీ నిద్రకు ఇబ్బంది ఉండదు. ఒక వేళ నీరు తాగుతే మధ్య లో లేవాల్సి వస్తుంది. స్మార్ట్ ఫోన్స్ చూడటం: స్మార్ట్ ఫోన్స్ కు రాత్రవేళలలో దూరంగా ఉండటం మంచిది. ఆర్టిఫిషియల్ లైట్ కు ఫోన్లను ఉదాహరణగా చెప్పవచ్చు. దీని వల్ల బాడీ మెలటోనిన్ ప్రొడక్షన్ షెడ్యూల్ నేచురల్ సిర్కాడియన్ రిథమ్స్ పై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇంకా ఫోన్ దగ్గర ఉంటే నోటిఫికేషన్ శబ్ధంతో చెక్ చేసుకోవల్సి వస్తుంది. అందుకే నిద్రించే 2 ముందు ఫోన్ దూరంగా ఉంచడం మంచిది. ఆల్కహాల్: ఆల్కాహాల్ తాగే వారు కూడా నిద్రించే ముందు మూడు గంటలు ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది కాదు. వైన్ లోని చక్కెర రాత్రి సమయంలో మీ మనస్సును పునరుజ్జీవింపజేస్తాయి. నిద్రించే ముందు మీ భాగస్వామితో ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు. ఏదైనా మాట్లాడుకోవల్సి ఉంటే తర్వాతి రోజు మాట్లాడుకోవడం మంచిది. రాత్రి భోజనం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా తినకూడదు. వైట్ బ్రెడ్, వైట్ రైస్ వంటి వాటి జోలికి వెళ్లకూడదు. ఇది కూడా చదవండి: దిమాక్ ఉన్నోడు దునియాలో ఎక్కడైనా బతుకుతాడు…వైరల్ వీడియో..!! #sleep #health #lifestyle మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి