Heart Attack: ఉప్పు మాత్రమే కాదు చక్కెర ఎక్కువ తీసుకుంటే గుండెపోటు వస్తుందా..?

ఉప్పు, చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి అత్యంత హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మధుమేహానికి ప్రధాన కారణం చక్కెర. రోజుకు 95 గ్రాముల చక్కెరను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

New Update
Heart Attack: ఉప్పు మాత్రమే కాదు చక్కెర ఎక్కువ తీసుకుంటే గుండెపోటు వస్తుందా..?

Heart Attack: ప్రస్తుత కాలంలో దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి. దీనికి ఆహార అలవాటే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉప్పు, చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి అత్యంత హాని కలుగుతుందని చెబుతున్నారు. ఎక్కువగా ఉప్పు, సోడియం తీసుకునే వారికి గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఉప్పుతో పాటు చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు పెరుగుతాయని అంటున్నారు. మధుమేహానికి ప్రధాన కారణం చక్కెర. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

చక్కెర ఎక్కువగా తింటే ఏమవుతుంది?:

  • BMC మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం ఆహారంలో చక్కెర అధికంగా తీసుకోవడం గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొన్నారు.

అధ్యయనం ఏం చెబుతుంది?:

  • యూకేలో 37 నుంచి 73 సంవత్సరాల వయస్సు గల 1.10 లక్షల మంది ఆహారపు అలవాట్ల డేటా ఆధారంగా ఓ అధ్యయనం చేశారు. వారి ఆరోగ్య ఫలితాలను దాదాపు తొమ్మిదేళ్లపాటు ట్రాక్ చేశారు. అధిక చక్కెర తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 6 శాతం, స్ట్రోక్ 10 శాతం పెరుగుతుందని అంచనాకు వచ్చారు. అధ్యయనంలో పాల్గొన్నవారికి సాధారణ చక్కెర, ప్రాసెస్ చేసిన చక్కెర, స్వీట్లు ఇచ్చారు. కొందరు వ్యక్తులు కుకీలు, చక్కెర పేస్ట్రీల రూపంలో కూడా చక్కెర తీసుకున్నారు. అయితే పండ్లు, కూరగాయలలో సహజంగా లభించే చక్కెరలు శరీరానికి హాని చేయవని శాస్త్రవేత్తలు అంటున్నారు.

గుండె జబ్బులు, పక్షవాతం వస్తుందా?:

  • రోజుకు 95 గ్రాముల చక్కెరను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే చక్కెర శాతం 10కి మించకూడదని సూచిస్తున్నారు.

ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?:

  • చక్కెర, తీపి పానీయాలను తక్కువగా తీసుకోవాలని, చక్కెర పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోయి రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుందని అంటున్నారు. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా రక్తపోటు కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. తెల్లని చక్కెరకు బదులు బెల్లం తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వేడి నీటితో స్నానం చేస్తే సంతానోత్పత్తి తగ్గుతుందా?..నిపుణులు ఏమంటున్నారు?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు