intermittent Fasting: ఈ మధ్య కాలంలో ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా ఫేమస్ అయింది. అయితే ఈ 16:8 నిష్పత్తిలో చేసే ఫాస్టింగ్ ముఖ్య ఉద్దేశం ఒకరోజులో దాదాపు 16 గంటల వరకు మన కడుపును ఖాళీగా ఉంచుకోవడం. ఒక 8 గంటల పాటు తింటూ ఉండాలని అంటున్నారు. ఈ డైట్‌ను 10 రోజులు లేదా నెల రోజులు చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని అధ్యయనాలు అయితే ఈ ఉపవాసం చేయడంతో కార్డియో వాస్క్యులర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉండవని చెబుతున్నాయి. అయితే కొత్తగా ఒక అధ్యాయం మాత్రం కళ్లు చెదిరే విషయాలు బయటపెట్టింది.
మరణించే అవకాశాలు ఎక్కువ:
- ఇంటర్ మిటెంట్ డైట్ చేసేవారు మామూలు వ్యక్తులతో పోలిస్తే గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయే ఛాన్సులు 91 శాతం అధికంగా ఉంటుందని చికాగో పరిశోధకులు అంటున్నారు. 16:8 ఫాస్టింగ్ అనేది బరువు, కొలెస్ట్రాల్, జీర్ణక్రియకు మేలుచేసేదని ప్రజలు నమ్ముతున్నా.. వాస్తవానికి అది ప్రాణాంతకం అని అధ్యయనం చెబుతోంది.
అధ్యయనం ఎలా జరిగింది?
- పరిశోధకులు 2003 నుంచి 2018 మధ్య కాలంలో జరిపిన 20 వేల మంది పెద్దలకు సంబంధించిన డేటాను విశ్లేషించారు. ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ చేయనివారితో పోల్చుకుంటే 16:8 పద్ధతిలో ఈ ఫాస్టింగ్ చేసేవారు గుండె సంబంధిత సమస్యలతో చనిపోయే అవకాశాలు 91 శాతం అధికంగా ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 8-10 గంటల మధ్య క్యాలరీలు వాడేసేవారు సాధారణంగా గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్‌తో చనిపోయే అవకాశాలు 66 శాతం ఉంటాయని అంటున్నారు. అయితే లోతైన అంశాలపై మరోసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్‌పై ఇంకా అధ్యయనం చేయాలని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: గుమ్మడికాయతో బోలెడు ఆరోగ్యం మీ సోంతం..ఈ రోజే ఇంటికి తెచ్చుకోండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.