కరోనా వచ్చినప్పటి నుంచి అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. అంతేకాదు చిన్న సమస్య వచ్చినా.. వెంటనే వైద్యుల సలహాలు తీసుకుంటున్నారు. అదే జ్వరం వస్తే ఇంకా జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే.. మామూలుగా జ్వరం వచ్చినప్పుడు అందరూ ఎక్కువశాతం బ్లాంకెట్ కప్పుకుని పడుకుంటారు. జ్వరం వచ్చిన సమయంలో కొద్దిపాటి చలిని కూడా మన శరీరం భరించలేదు. ఆదే సమయంలో ఇక స్నానం జోలికి ఎంతోదూరంగా ఉంటారు. జ్వరం వస్తే స్నానం చేయడం మంచిది కాదని చాలా మంది చెబుతుంటారు. అయితే.. ఈ మాటలో ఏమాత్రం నిజం లేదని చెప్పాలి. ఎందుకంటే..? వైద్యుల సలహా ప్రకారం జ్వరం వచ్చినా కూడా స్నానం చేయవచ్చు అంటూన్నారు.
ఇది కూడా చదవండి: ఆహారపు అలవాట్ల వల్ల తొందరగా వృద్ధాప్యం
జ్వరం వచ్చిన వారు ఎలాంటి భయం పెట్టుకోవాల్సి అవసరం లేకుండా హ్యాపీగా స్నానం చేయవచ్చు అంటున్నారు వైద్యులు. జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవద్దనేది కేవలం అపోహేనని అంటున్నారు. నిజానికి స్నానం చేస్తేనే మంచిదని నిపుణులు కూడా వెల్లడిస్తున్నారు. అయితే.. జ్వరం వచ్చినప్పుడు మామూలుగానే మన శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. అది మందులతో నెమ్మదిగా తగ్గుతుంది. కానీ.. స్నానం చేయడం వల్ల వేడి త్వరగా తగ్గి జ్వరం త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుదంటున్నారు డాక్టర్లు.
సర్జరీలు చేపించుకున్న వారికి స్నానం చేయరాదు
అంతేకాదు.. జ్వరం వచ్చిన వారు వేడి నీటితో స్నానంతోపాటు.. తలస్నానం కూడా చేయవచ్చు. ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని వైద్యులు అంటున్నారు. స్నానం చేయడంవల్ల శరీరంలో ఉండే వేడి త్వరగా బయటకు వెళ్లిపోయి..దీంతో శరీరం చల్లబడుతుంది. మందులతో అయితే నెమ్మదిగా జ్వరం తగ్గుతుంది. అయితే.. సర్జరీలు చేపించుకున్న వారికి జ్వరం వస్తే మాత్రం వెంటనే స్నానం చేయరాదని అంటున్నారు. వేడి నీళ్లలో గుడ్డను ముంచి బాడీని తుడిస్తే సరిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. కానీ.. ఇతర కారణాల వల్ల జ్వరం వస్తే మాత్రం కచ్చితంగా స్నానం చేయాలి. దీంతో జ్వరం వేగంగా తగ్గి త్వరగా కోలుకుంటారు. ఇది కేవలం సమాచారం కోసమే చెప్పబడుతుంది. అధిక సమస్యలు వచ్చినా.. ఎక్కువ జ్వరం ఉన్నా.. వెంటనే డాక్టర్ సలహాలు పాటించి తగు చర్యలు తీసుకుంటే మంచిది.
ఇది కూడా చదవండి: క్యాన్సర్ నుంచి కాపాడే ఆకు..అద్భుత ప్రయోజనాలు