Health Tips: బీరకాయ కూర వండే సమయంలో ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు తెలుసా?

Health Tips: బీరకాయ కూర వండే సమయంలో ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు తెలుసా?
New Update

మనం నిత్యం తీసుకునే కూరగాయల్లో బీరకాయ ఒక్కటి. ఇందులో ఎన్నో రకాలు ఉంటాయి. ముఖ్యంగా నేతిబీరకాయ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అందులో తక్కువ కేలరీలు, ఫైబర్ ఎక్కుగా ఉంటుంది. అంతేకాదు యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందించడంతోపాటు రోగనిరోధకశక్తిని పెంచడం దగ్గర నుంచి చర్మ ఆరోగ్యం వరకు బీరకాయ మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

మధుమేహులకు దివ్యౌషధం: 

ముఖ్యంగా బీరకాయలో ఉండే పదార్థం మన రక్తంలో చక్కెరస్థాయిని కంట్రోల్లో ఉంచుతుంది. షుగర్ తో బాధఫడేవారు లేదా అది వచ్చే ప్రమాదం ఉన్నవారు బీరకాయను ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలను నివారించడంతో బీరకాయ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి బీరకాయలో ఎక్కువగా లభిస్తుంది. ఇది మన ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. జింక్, ఐరన్, పొటాషియం, ఇతర విటమిన్లు, మినరల్స్ రోగనిరోధకవ్యవస్థను రక్షించడానికి అవసరం.

చర్మాన్ని రక్షిస్తుంది: 

బీరకాయలో ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అంతేకాదు ఇది సిలికాను కలిగి ఉంటుంది. చర్మం మాత్రమే కాకుండా జుట్టు, గోళ్ల నిర్వహణకు కూడా ముఖ్యమైంది. శరీరంలోని వేడిని తగ్గించడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, రిబోఫ్లావిన్, థయామిన్, జింక్ వంటి మూలకాలు ఇందులో ఉంటాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అంతేకాదు కాలేయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ప్రమాదకర వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించేందుకు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది.

సలాడ్స్ రూపంలో : 

అయితే బీరకాయను కూరగా మాత్రమే కాకుండా ఎన్నో పద్ధతుల్లో వండుతారు. కొంతమంది సలాడ్స్ రూపంలోనూ తీసుకుంటారు. అయితే బీరకాయను వండేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏంటంటే...ఎక్కువగా నీరు ఉపయోగించి బీరకాయకూరను వండకూడదు. ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎందుకంటే ఇందులో నీటిలో కరిగే విటమిన్లు ఉంటాయి. ఎక్కువసేపు ఉడికిస్తే వాటిని కోల్పోవచ్చు. ఈ విషయం గుర్తు పెట్టుకోని బీరకాయ కూరను వండాలి.

ఇది కూడా చదవండి:  పదేళ్లలోపు బాలికలకు తల్లిదండ్రులు ఈ విషయాలు తప్పక నేర్పించాలి..!!

#health-tips #vegetables #health #health-tips-telugu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe