Viral Video: ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల తల్లి ఏం చేసిందో చూడండి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడిని ఇంట్లో ఉంచుకోవడానికి భర్త నిరాకరించాడని మహిళ కరెంట్‌ స్తంభం ఎక్కి నానా హంగామా సృష్టించింది. వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
Viral Video: ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల తల్లి ఏం చేసిందో చూడండి

Viral Video:ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు పెరిగిపోయాయి. అక్రమ సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. దంపతుల మధ్య గొడవలకు ఎక్కువగా అక్రమ సంబంధాలే కారణం అని నిపుణులు అంటున్నారు. దంపతుల్లో ఎవరోఒకరి ఎఫైర్‌ బయటపడితే తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. పెళ్లైన మహిళలు యువకులతో ఎక్కువగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.

ఈ తరహా ఘటనే యూపీలో జరిగింది గోరఖ్‌పూర్‌కు చెందిన 34 ఏళ్ల ముగ్గురు పిల్లల తల్లి యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా అతడిని ఇంట్లోనే ఉంచుకుంటే ఆర్థిక సమస్యలు ఉండవంటూ భర్తను ఒప్పించే ప్రయత్నం చేసింది. అందుకు భర్త రామ్‌గోవింద్‌ అంగీకరించలేదు. ఆమెతో గొడవకు దిగాడు. దాంతో మనస్తాపం చెంది కరెంట్‌ స్తంభం ఎక్కింది. అప్పటికే స్థానికులు కరెంట్‌ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.

publive-image

ఆమెను ఒప్పించి స్థానికులు పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సాయంతో ఆమెను కిందకి దించారు. భర్త ఆమె ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతేడాది నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లో ఇదే తరహా ఘటన జరిగింది. ఓ మహిళ తన ప్రియుడు పెళ్లి చేసుకోవడం లేదంటూ మొబైల్ టవర్ ఎక్కింది. తన ప్రియుడు తనను మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచన చేశాడంటూ యువతి ఆరోపించింది.

ఇది కూడా చదవండి: ఇంట్లో నరదిష్టి పోవాలంటే వెంటనే ఈ పరిష్కారాలు చేసుకోండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు