Health Tips: వీటిని ఆరెంజ్‌తో కలిపి అస్సలు తినొద్దు.. ఆ ఐటెమ్స్ లిస్ట్ ఇదే! నారింజతో కొన్ని ఆహారాలు తినకూడదని తెలుసా. నారింజ పండ్లను అరటిపండు, పాలు, టొమాటోలు, టీ, కాఫీ, నూనెలో మసాలాలు, డ్రింక్స్‌తో తింటే జీర్ణ సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తుంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 12 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Health Tips: విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందులో ఆరెంజ్ పండు ఒకటి. అంతేకాదు కొన్ని ఆహారాలతో ఈ పండును కలిపి తింటే ప్రాణం తీయగలదు. మనలో చాలామందికి ఆరెంజెస్ అంటే ఇష్టపడరు. యాపిల్స్‌తో పోల్చితే నారింజ చాలా తక్కువ ధర ఉంటుంది. ఎంతో రుచికరంగా, నోట్లో పెట్టుకోగానే తియ్యగా, పుల్లగా ఉండే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో విటమిన్ సీ, పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి మన శరీరానికి చాలా ముఖ్యం. అయితే కొన్ని పండ్లను అలా కలుపి తినకూడనవి ఉన్నాయి. నారింజతో కొన్ని ఆహారాలు తినకూడదని తెలుసా..? సాస్‌ల నుంచి డెజర్ట్‌ల వరకు, ప్రతిదాంటో నారింజ జ్యూస్ వాడుతారు. కానీ.. అలా తింటే జీర్ణ సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తుంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నారింజ పండుతో తీసుకోకూడని పదార్థాలు అరటిపండు: చాలా మంది ఫ్రూట్ సలాడ్ లాగా.. నారింజ, అరటి, పాల వంటివి కలిపి తింటారు. కానీ.. అరటిపండును నారింజతో కలిపి తింటే అంధత్వం సహా అనేక సమస్యలు దారి తీసుకుంది. అందువల్ల అరటిపండునూ, నారింజనూ కలిగి తినవద్దని వైద్య నిపుణులు అంటున్నారు. పాలు: నారింజతో పాలు, ఏదైనా పాలతో చేసినవి తినవద్దు. అలా తింటే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. ఎందుకంటే.. నారింజ రసానికీ పాలకూ పడదు. వీటిల్లో ఉంటే యాసిడ్.. పాలతో కలిసినప్పుడు గ్యాస్ వచ్చి కడుపులో పెద్ద సమస్యకు వచ్చేలా చేస్తుంది. టొమాటోలు: సాధారణంగా నారింజ, టొమాటోలును కలిపి ఎవరూ తినరు. టొమాటోలో కూడా విటమిన్ సి, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ.. ఈ రెండు ఆమ్ల పండ్లను కలిపి తింటే యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. టీ, కాఫీ: నారింజ పండ్లను టీ, కాఫీలతో కలిపి తింటే కడుపునొప్పి, గుండెపోటు వంటి సంభవించవచ్చు. నారింజలో ఉండే పోషకాలు.. ఇతర ఆహార పదార్థాలతో కతిస్తే గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. నూనెలో మసాలాలు: ఆరెంజ్‌ను ఆయిల్ మసాలా దినుసులతో కలిపితే.. అసిడిటీ, లివర్ అల్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనం ఒక్కోసారి ఆయిల్ ఫుడ్, ఫ్రై ఫుడ్ తిన్న తర్వాత ఏదైనా పండు తిన్నాలి. ఆరెంజ్ పండును తినవద్దని సూచిస్తున్నారు. డ్రింక్స్: ఆరెంజ్ ముక్కలను తింటూ కార్బోనేటేడ్ డ్రింక్స్‌ను కొందరూ తాగుతారు. పార్టీలలో ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తే ప్రమాదకరమే. డ్రింక్స్‌లో, ఆరెంజ్‌లోని గ్యాస్ ఉంటుంది కాబట్టి రెండూ తేడా కొడతాయి. దీంతో వికారం, కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. ఇది కూడా చదవండి: చలికాలంలో ఈ సమస్యలా..నిర్లక్ష్యం చేయకండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-tips #health-benefits #orange మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి