BRS Manifesto: రెచ్చిపోయిన డీకే అరుణ.. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోపై షాకింగ్ కామెంట్స్ బీఅర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై డీకే అరుణ స్పందించారు. కన్న తల్లికి అన్నం పెట్టనివాడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు ఉంది బీఅర్ఎస్ మ్యానిఫెస్టో అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. By Vijaya Nimma 15 Oct 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి కన్న తల్లికి అన్నం పెట్టనివాడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు ఉంది బీఅర్ఎస్ మ్యానిఫెస్టో అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో బీఅర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో (BRS Manifesto)పై డీకే అరుణ స్పందించారు. ఆదివారం సాయంత్రం పత్రిక ప్రకటన విడుదల చేశారు. 2014 నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పనులు, ఇప్పుడు 2023లో చేస్తానంటే తెలంగాణ ప్రజలు నమ్మరని డీకే అరుణ అన్నారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి (unemployment benefits) ఇస్తానని 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైపోయింది..? అని డీకే అరుణ ప్రశ్నించారు. ఇది కూడా చదండి: తెలంగాణ ప్రజల చెవుల్లో కేసీఆర్ గులాబీ పూలు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కేసీఆర్ ఇప్పుడు ఇచ్చిన హామీలు కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయడానికి తప్ప, నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం సీఎంకు లేదని డీకే అరుణ ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువత కోసం ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ (Job calendar) విడుదల చేస్తానని చెప్పి, ఇంత వరకు దాని దిక్కు మొక్కు లేకుండా చేసిన ఘనుడు కేసీఆర్ అని డీకే అరుణ నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమి లేదు కాబట్టి.. కేవలం ఉచిత పథకాలను నమ్ముకుని ఎన్నికలకు పోయేందుకు సిద్ధమయ్యారని డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితాలు ప్రకటించడం పక్కన పెట్టి.. మొదట రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని డింమాడ్ చేశారు. ఆరోగ్యశ్రీ పథకం (Arogyasree Scheme) తెలంగాణలో అమలవుతుందా..? అని ప్రశ్నించారు. ఒక వేళ అమలైతే, మీ ఇంటి దవాఖానగా పేరున్న ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఎంత వరకు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నారో.. వెల్లడించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: కొత్త స్నేహాలు ఎంతవరకు.. ఎవరిని నమ్మాలి..? #cm-kcr #dk-aruna #bjp-national-vice-president #brs-manifesto #countered మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి