BRS Manifesto: ఇవాళ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల..హుస్నాబాద్ సభ నుంచి ఎన్నికల యుద్ధరంగంలోకి కేసీఆర్..!
తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. ఇవాళ(అక్టోబర్ 15) బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రకటించనున్నారు కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో పాల్గొని మ్యానిఫెస్టోను విడుదల చేస్తారు. తర్వాత అభ్యర్థులకు ఫారమ్‌లను అందిస్తారు. పార్టీ పెండింగ్‌లో ఉంచిన ఐదు నియోజకవర్గాల్లో కనీసం రెండింటికి కూడా కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అటు సాయంత్రం హుస్నాబాద్‌కి వెళ్తున్నారు కేసీఆర్. అక్కడ జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు.