DK ARUNA : వాళ్లు నన్ను ఖతం చేయాలనుకున్నారు.. ఈసారి ఎంపీగా గెలుస్తా

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ మనుగడను ఖతం చేయాలనుకున్నారని, అందుకే బీజేపీలోకి వచ్చినట్లు చెప్పారు. ఈసారి మహాబూబ్ నగర్ ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

DK ARUNA : వాళ్లు నన్ను ఖతం చేయాలనుకున్నారు.. ఈసారి ఎంపీగా గెలుస్తా
New Update

DK ARUNA : బీజేపీ (BJP) జాతీయ ఉపాధ్యక్షురాలు, గద్వాల్ మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి కూడా పోటీలో ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం తనకు అవకాశం ఇస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇటీవల Rtvకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయ భవిష్యత్తు, పార్లమెంట్ ఎన్నికలు తదితర అంశాలపై క్లుప్తంగా మాట్లాడారు.

మహాబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తా..

డీకే అరుణ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో మహాబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తానన్నారు. లాస్ట్ టైమ్ పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఈసారి తప్పకుండా గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు. జితెందర్ రెడ్డి పోటీలో ఉన్నప్పటికీ అధిష్టానం తనకు అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏదీ ఏమైనా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. మహాబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయినందుకు సంతోషంగా ఉందన్నారు. రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ వ్యక్తిగతంగా ఒకరిపట్ల ఒకరికి అభిమానం ఉంటుందని చెప్పారు. పర్సనల్ విషయాల్లో ఎలాంటి విభేదాలు లేవని, ప్రజా సమస్యలపై మాత్రం ఫైట్ చేస్తామన్నారు. ఇక రేవంత్ కాంగ్రెస్ లోకి రావడంపై తనకు వ్యతిరేకత లేదన్నారు. కాంగ్రెస్ ను వదిలి బీజేపీలోకి రావడానికి రేవంత్ కారణం కాదన్నారు. వ్యక్తిగత కారణాలతోనే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వచ్చానని స్పష్టం చేశారు.

టికెట్ ఇవ్వలేదు..

స్వతంత్ర ఉద్యమ నేపథ్యం ఉన్న తమ కుంటుంబం కాంగ్రెస్ పార్టీకోసం ఎంతో చేసిందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ 2019లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని, ఆ కారణంతో తాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానని చెప్పింది. 1999-2004 వరకూ జిల్లాలో అనేక ఉద్యమాలు చేసి, పాదయాత్రలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేశాను. అలాంటి త్యాగాలను గుర్తించకుండా మరోకరికి టికెట్ ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. జిల్లాలో తనతోనే కాంగ్రెస్ కు ఊపు వచ్చిందని, అనేక రాజకీయాలు చేసి తనకు టికెట్ ఇవ్వకుండా చేశారని వాపోయింది. ఇక కాంగ్రెస్ లో తనను ఖతం చేసేందుకు కుట్రలు జరిగాయని, ముందే గమనించి పార్టీనుంచి బటయకు వచ్చినట్లు తెలిపారు.

ఆ వ్యతిరేకతే కాంగ్రెస్ ను గెలిపించింది..

ఇక కేసీఆర్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరూ నమ్మలేదన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతే కాంగ్రెస్ ను గెలిపించిందన్నారు. బీజేపీలో తాను అసంతృప్తిగా ఉన్నారనే మాటలన్నీ ఫేక్ అని, తాను కంపర్ట్ గా ఉన్నానని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేననే గాసిప్స్ బీజేపీ పార్టీకి మైనస్ అయ్యాయన్నారు. సోషల్ మీడియా, టీవీ ఛానల్లు పదే పదే రెండు పార్టీలు ఒకటే, ఒకటే అని ప్రచారం చేసి జనాలను నమ్మించారని చెప్పారు. బీజేపీపై అపనమ్మకం కలిగించడంలో కాంగ్రెస్ పై చేయి సాధించింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని పెద్ద ఎత్తున్న మీడియా ప్రయత్నించిందని ఆమె అన్నారు.

ఇది కూడా చదవండి : Tamannaah: బోల్డ్ షోతో రెచ్చిపోయిన తమన్నా.. సాఫ్ట్ పోర్న్ స్టార్ అంటూ దారుణమైన ట్రోలింగ్

అలాగే బండి సంజయ్ పార్టీ అధ్యక్ష పదవి మార్చడం వల్లే పార్టీ దెబ్బతిన్నదనేద వాదనలు కరెక్ట్ కాదని చెప్పింది. జాతీయ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి అందరం పనిచేస్తామన్నారు. అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఉన్నట్లు బీజేపీలోనూ గ్రూప్ రాజకీయాలున్నాయన్నారు.

మేన కోడలు గెలుపు.. 

ఇక మేన కోడలు పర్నికరెడ్డిని గెలిపించేందుకే ఎమ్మెల్యే గా పోటీచేయలేదని చెప్పడం ఫన్నీగా ఉందన్నారు. పర్నికారెడ్డికి కూడా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని, తన కుటుంబం మొత్తం రాజకీయ వారసులేనన్నారు. అందరం ఒకే కుంటుంబంలో జన్మించామని, అందరికీ రాజకీయ అనుభవం ఉందన్నారు. అంతేగానీ ఆమెకోసం తాను పోటీనుంచి తప్పుకోలేదని స్పష్టం చేశారు. బీసీ ఓట్లు చీల్చారనే వాదనలు కూడా దుర్మార్గమన్నారు. తన మీద బురదజల్లేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నడిగడ్డ రాజకీయం భిన్నమైనది..

రాజకీయాలకు నడిగడ్డ నేపథ్యం పూర్తిగా విభిన్నమైనదిగా పేర్కొన్నారు. కర్నాటక, రాయలసీమల ఇంపాక్ట్ ఉంటుందని, తెలంగాణలోనే గద్వాల్ రాజకీయాం డిఫరెంట్ అన్నారు. గద్వాల్ లో బంగ్లా రాజకీయాలను బద్దలు కొడతానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. బంగ్లాకు ప్రజలే పేరు పెట్టారన్నారు. అర్ధరాత్రి ఆడపిల్లలు ఆ బంగ్లాకు వచ్చి ఆసరా పొందవచ్చు. ఇప్పటివరకూ బంగ్లాలో ఎలాంటి అరాచకాలు జరిగాయో చూపించాలని సవాల్ చేశారు. పేద ప్రజలకు సేవా చేస్తున్నందుకు తమకు దక్కుతున్న కీర్తిని దెబ్బతీసేందుకే కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

కేంద్రమంత్రి పదవి గురించి ఆశ ఉన్నప్పటికీ తన చేతిలో లేదని, మోడీ నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా తాను బాధ్యతలు చేపట్టడంపై తనకు ఆలోచన లేదని, పార్టీ అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో ఉండదన్నారు.

ఇప్పుడే ఏమీ చెప్పలేను..

రేవంత్ రెడ్డి పాలనపై స్పందిస్తూ.. నెల రోజుల్లో ఏమీ చెప్పలేమన్నారు. కొత్తలో వారు ఉత్సాహంగా కనిపించినప్పటికీ ఆరు నెలల్లో తెలుస్తుందన్నారు. వంద రోజులు టైమ్ అడిగారు. కాబట్టి మేము వేచి చూస్తున్నాం. సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఇంకా లొసుగులున్నాయని, అధికారంలో ఉన్నందుకు సైలెంట్ గా పనిచేస్తున్నారన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక పోతే బీఆర్ఎస్ పట్టిన గతే పడుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు డీకే అరుణ.

#parlament #2024-elections #dk-aruna #mahaboobnagar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe