Telangana : పేదలకు గుడ్ న్యూస్.. శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు?

అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులను శివరాత్రి వరకూ అందించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలనలో 20 లక్షమంది దరఖాస్తు పెట్టుకోగా.. ఫిబ్రవరిలో లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించినట్లు సమాచారం.

Telangana : పేదలకు గుడ్ న్యూస్.. శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు?
New Update

Ration Card : తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు రేషన్ కార్డు(Ration Cards) లనే ప్రామాణికంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా లబ్దిదారులకు పథకాలను అందించేందుకు కొత్త రేషన్ కార్డులను సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు..

ఈ మేరకు లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) కోడ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరు నాటికి కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే శివరాత్రి(Shivaratri) నాటికి కొత్త రేషన్ కార్డులను అందించాలన్నది రేవంత్ సర్కార్ టార్గెట్ పెట్టుకుందని, ఇందుకు సంబంధించి అధికారులతోనూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

వారి సంఖ్య అధికం..

ఇక ఇటీవల స్వీకరించిన ప్రజా పాలనలో మొత్తం 1,25,84,383 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులున్నాయి. రేషన్ కార్డులు, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 వచ్చాయి. ముఖ్యంగా ఐదు గ్యారెంటీల కంటే కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం విశేషం.

ఇది కూడా చదవండి : Golden Globes : ‘గోల్డెన్‌ గ్లోబ్‌’అవార్డ్స్’.. సంచలనం సృష్టించిన ‘ఓపెన్‌హైమర్’

అలాగే దరఖాస్తులు సమర్పించలేని వాళ్లు గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి లేదా మండల పరిషత్ కార్యాలయంలో ఇవ్వాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమానికి చివరి గడువు అంటూ ఏమీ లేదని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కోటి పది లక్షల దరఖాస్తులు..

గత ఏడాది డిసెంబర్ 28 నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన(Praja Palana) దరఖాస్తులను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జనవరి 6వ తేదీతో ముగిశాయి. అయితే.. ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలకు దరఖాస్తులను తీసుకున్నారు. దీనిలో యువ వికాసం గ్యారెంటీకి మాత్రం దరఖాస్తులను ఆహ్వానించలేదు. మొత్తం 5 గ్యారెంటీలకు దాదాపు కోటి పది లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.ఏది ఏమైనా రేషన్ కార్డుల అర్హుల జాబితాను ఈ నెలాఖరుకు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

#telangana #shivaratri #ts-new-ration-cards #congress
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe