Telangana: కాంగ్రెస్‌ శ్రేణులకు మళ్లీ నిరాశ.. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే !

రేవంత్ అమెరికా పర్యటన నుంచి వచ్చాక కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం ఉంటుందని భావించిన కాంగ్రెస్ శ్రేణులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆగస్టు 15న ఢిల్లీ వెళ్లిన సీఎం అదే రోజు తిరిగివచ్చారు. దీంతో కేబినేట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేననే ప్రచారం నడుస్తోంది.

New Update
Telangana: కాంగ్రెస్‌ శ్రేణులకు మళ్లీ నిరాశ.. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే !

ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని రాష్ట్రానికి తిరిగివచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్స వేడుకలు, సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, రైతు రుణమాఫీ సభతో ఆయన బిజీబీజీగా గడిపారు. ఆ తర్వాత డైరెక్టుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. రెండురోజుల పాటు రేవంత్ పర్యటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కేబినెట్ విస్తరణ, పీసీసీ నియామకం అంశాల గురించి పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు వెళ్లారనే ప్రచారం జరిగింది. కానీ రేవంత్ ఢిల్లీకి చేరుకున్న తర్వాత అదే రోజున వెనక్కి తిరిగివచ్చారు.

Also Read: బోర్టు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ.. ఎక్కడంటే ?

కేవలం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మాత్రమే రేవంత్ కలుసుకున్నారు. విపక్ష నేత రాహుల్ గాంధీ అందుబాటులో లేరు. అలాగే సోనియా గాంధీ అనారోగ్యరీత్య రేవంత్‌ను కలవలేకపోయారు. దీంతో ఆయన అదే రోజు వెనక్కి తిరిగిరావాల్సి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. ఇటీవల రేవంత్ అమెరికా పర్యటన నుంచి వచ్చిన వెంటనే కేబినెట్ విస్తరణ ఉంటుందని, అలాగే పీసీసీ నియామకం కూడా జరుగుతుందని జోరుగా ప్రచారాలు జరిగాయి. ప్రస్తుత పరిస్థితులు కూడా ఇవి మరికొంత కాలం వాయిదా పడేటట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే మంత్రిత్వ శాఖల్లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో హోంశాఖ, విద్యా శాఖ వంటి వాటికి మంత్రులు లేకపోవడంతో రేవంత్ సర్కార్‌పై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి ఇప్పటికే తనకు హోమంత్రి పదవి ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే మాదిగలు కూడా తమ సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి కచ్చితంగా ఇస్తామని ఇప్పటికే రేవంత్ సర్కార్ ప్రకటించింది. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయం కానున్నట్లు సమాచారం. ఇక మిగతా శాఖల్లో ఎవరెవరికి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అలాగే పీసీసీ చీఫ్ పదవి కోసం సీనియర్ నేతలు తమ లాబీయింగ్స్ కొనసాగిస్తున్నారు. పీసీసీ చీఫ్‌గా ఎవరిని నియమిస్తారనే దానిపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: దసరా నుంచే స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం: సీఎస్ శాంతి కుమారి

Advertisment
Advertisment
తాజా కథనాలు