Kalki 2898 AD: ఈ పజిల్‌ను ఫిల్ చేస్తే లక్ష రూపాయలిస్తా.. కల్కి కోసం ఆర్జీవీ బంపరాఫర్‌

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రభాస్ కల్కి ట్రైలర్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. కల్కి ట్రైలర్ పై క్రియేట్ చేసిన ఓ పజిల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ పజిల్ ముందుగా పూర్తి చేసిన వారికి లక్ష రూ. బహుమతిగా ఇస్తానని తెలిపారు.

New Update
Kalki 2898 AD: ఈ పజిల్‌ను ఫిల్ చేస్తే లక్ష రూపాయలిస్తా.. కల్కి కోసం ఆర్జీవీ బంపరాఫర్‌

RGV Puzzle On Kalki 2898 AD Trailer : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కల్కి '2898 AD'. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రంజూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేయగా మంచి టాక్ సొంతం చేసుకుంది. ట్రైలర్ లో ఓ కొత్తలోకాన్ని ఆవిష్కరించాడు దర్శకుడు నాగ్‌అశ్విన్‌ (Nag Ashwin). ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు సైతం కల్కి ట్రైలర్ కు ఫిదా అయ్యారు.

లక్ష రూపాయలు వారికే

అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ట్రైలర్ ను ప్రశంశిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కల్కి ట్రైలర్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు వర్మ. కల్కి ట్రైలర్ పై క్రియేట్ చేసిన ఓ పజిల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ పజిల్ ముందుగా పూర్తి చేసిన వారికి లక్ష రూ. బహుమతిగా (1 Lakh Prize) ఇస్తానని తెలిపారు. ఇందులో కొన్ని లెటర్స్ మిస్ చేసి పజిల్ క్రియేట్ చేశాడు. దీంతో పజిల్ పూర్తి చేయడానికి నెటిజన్లు తెగ కష్టపడుతున్నారు. మరి ఆ లక్ష గెలిచే లక్కీ బాయ్ / గర్ల్ ఎవరో తెలియాలంటే వర్మ నెక్స్ట్ పోస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read: GOAT Movie: ట్రెండింగ్ లో 'GOAT' గ్లింప్స్ ... డ్యూయల్ రోల్ లో విజయ్ మాస్ యాక్షన్ ...! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు