Bahubali : త్వరలోనే మరో బాహుబలి..రాజమౌళి నుంచి అఫీషీయల్ అనౌన్స్మెంట్! అతి త్వరలోనే బాహుబలి 3 రానున్నదంటూ రాజమౌళి టీమ్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. బాహుబలి ది క్రౌన్ అండ్ బ్లడ్ ..అనే ట్యాగ్ తో రీసెంట్ గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు . త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం అంటూ రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. By Bhavana 01 May 2024 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబోలో వచ్చిన బాహుబలి(Bahubali) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర రికార్డులు బ్రేక్ చేసి, ప్రపంచవ్యాప్తంగా హిట్ టాక్ సొంతం చేసుకుంది. హాలీవుడ్ సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిదంటే సినిమాని ప్రేక్షకులు అభిమానులు ఏ రేంజ్ లో ఆదరించారో తెలుసుకోవచ్చు. కొందరైతే రాజమౌళి మ్యాజిక్ బాహుబలి1,2 అంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అతి త్వరలోనే బాహుబలి 3(Bahubali 3) రానున్నదంటూ రాజమౌళి టీమ్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. బాహుబలి ది క్రౌన్ అండ్ బ్లడ్ ..అనే ట్యాగ్ తో రీసెంట్ గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు . త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం అంటూ రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. When the people of Mahishmati chant his name, no force in the universe can stop him from returning. Baahubali: Crown of Blood, an animated series trailer, arrives soon! pic.twitter.com/fDJ5FZy6ld — rajamouli ss (@ssrajamouli) April 30, 2024 “మాహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు.. ఈ విశ్వంలోని ఏ శక్తి అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు. ‘బాహుబలి : క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రాబోతోంది” అంటూ ఆయన తెలిపారు. కాగా, ఇది ఓ యానిమేటెడ్ సిరీస్ లాగా రాబోతుందని టీమ్ పేర్కొంది. దీంతో బహుబలి ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు. అయితే ఈయానిమేటేడ్ సిరీస్ ను థియేటర్లలో రిలీజ్ చేస్తారా ? లేదా ఓటీటీ(OTT) లో స్ట్రీమింగ్ చేయనున్నారా .. అనే విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. Also read: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు! #prabhas #rajamouli #pan-india-movie #bahubali మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి