Jai Hanuman : ఇది నా వాగ్దానం.. శ్రీ రామనవమి సందర్భంగా 'జై హనుమాన్' నుంచి బిగ్ అప్ డేట్! శ్రీ రామనవమి సందర్భంగా 'జై హనుమాన్' నుంచి బిగ్ అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. మూవీనుంచి ఇంట్రెస్టింగ్ లుక్ రిలీజ్ చేశాడు. ‘శ్రీరామ నవమి శుభాకాంక్షలు. శ్రీరాముడి దివ్య ఆశీర్వాదంతో ప్రేక్షకులందరికీ ఇది నా వాగ్దానం. మునుపెన్నడూ లేని అనుభూతిని అందిస్తాను' అన్నాడు. By srinivas 17 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Sri Rama Navami : దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రామనామ స్మరణతో ఊరు, వాడ మారుమోగుతున్నాయి. జై శ్రీరామ్(Jai Sri Ram) నినాదాలతో అయోధ్య రామ మందిరం దద్దరిల్లింది. భద్రాచలం(Bhadrachalam) లోనూ తెలంగాణ(Telangana) ప్రభుత్వం ఘనంగా సీతారాముల కళ్యాణం జరిపిస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి భారీ అప్ డేట్ వెలువడింది. "वचनं धर्मस्य रक्षणं" 🙏 Wishing everyone a very Happy & Blessed #RamNavami ❤️ On this sacred occasion and with the divine blessings of Lord Rama, this is my promise to all the audience across the globe to give you an experience like never before & a film to celebrate for a… pic.twitter.com/gFNWsN9F06 — Prasanth Varma (@PrasanthVarma) April 17, 2024 ఇది నా వాగ్దానం.. ఈ మేరకు శ్రీరాముడి నమ్మిన బంటు, రక్షకుడు హనుమంతుడి కథను సినిమాగా 'హనుమాన్'(Hanu-Man) పేరుతో తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ 'జై హనుమాన్'(JAI HANUMAN) నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్ చేశారు. యువ నటుడు తేజా సజ్జా(Teja Sajja) ప్రధాన పాత్రలో రాబోతున్న సెకండ్ పార్ట్ ‘జై హనుమాన్’ సినిమా నుంచి నయా లుక్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు మేకర్స్. ఇది కూడా చదవండి: Tamilisai Soundararajan: నా ఫోన్లను బీఆర్ఎస్ ట్యాప్ చేసింది.. బలమైన ఆధారాలున్నాయి! ‘ప్రతి ఒక్కరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ పవిత్ర సందర్భంగా శ్రీరాముడి దివ్య ఆశీర్వాదంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ ఇది నా వాగ్దానం. మునుపెన్నడూ లేని అనుభూతిని & జీవితకాలం జరుపుకునే చలన చిత్రాన్ని మీకు అందిస్తాను. ఇది మీ అందరికీ ప్రత్యేకం కానుంది’ అంటూ ప్రశాంత్ వర్మ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. #han-man #prashanth-varma #jai-hanuman #teja-sajja మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి