Dil Raju Press Meet : ఈ సంక్రాంతికి సందడి చేసేందుకు ముందుగా వచ్చిన సినిమా (GUNTUR KAARAM)గుంటూరు కారం. జనవరి 12 న రిలీజయి దుమ్మురేపే వసూళ్లతో దూసుకుపోతోంది. ఫ్యాన్స్ కు అయితే పండగ ముందే వచ్చినంత సంబరంగా ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాపై నెగిటివ్ రివ్యూస్ రావడం అటు ఫ్యాన్సును, ఇటు మకర్స్ ను విస్మయానికి గురిచేస్తోంది. ఓ స్టార్ హీరో సినిమాకు చాలా లెక్కలుంటాయి. కమర్షియల్ అంశాలు ఓ వైపు , మరో వైపు ఆ దర్శకుడి ట్రాక్ రికార్డ్ , హీరో ఇమేజ్ .. అప్పైకి మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు అన్నిటిని దృష్టిలోపెట్టుకుని చిత్రాన్ని రూపొందించాలి. అన్నీ చేసినా ఫలితం ఒక్కో సారి తారుమారవుతుంది. ఇలాంటి పరిస్థితి కేవలం మౌత్ టాక్ వల్లే జరుగుతుంది. ఇప్పుడు గుంటూరు కారం మూవీకి అదే జరిగింది. నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేస్తూ .. రివ్యూ స్ ఇచ్చే వారి సంఖ్యా ఎక్కువైపోయింది. సినిమా టైటిల్స్ పడగానే ఫోన్ లోనే రివ్యూస్ రాసే వాళ్ళున్న ఇలాంటి పరిస్థితుల్లో సినిమా నిలబడాలంటే ఖచ్చింతంగా కంటెంట్ ఉండాలి. దీనితో పాటు వ్యాపార సూత్రాలు పాటించాలి. సో.. ఇలాంటివన్నీ తెలిసిన త్రివిక్రమ్ గుంటూరు కారం విషయంలో ట్రోల్ల్స్ కు గురవుతున్నారు. సోషల్ మీడియా లో విపరీతమైన మీమ్స్ చేస్తూ త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు దిల్ రాజు , నాగ వంశీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు,
మీరు ఎంటర్టైన్ అవుతారని గ్యారంటీ నాది
ముందుగా చిత్ర నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ .. గుంటూరు కారం సినిమాను ఎంతో ప్రేమించిన మీడియా మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు నిన్న రిలీజయిన గుంటూరు కారం సినిమాను జనాలు బాగా ఆదరించారు.ఫస్ట్ డే కలెక్షన్స్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే ఉన్నాయి చాలా రోజుల తరువాత ఒక రీజినల్ తెలుగు సినిమా రిలీజయింది.ఫ్యామిలీ సెంటి మెంట్ తో ,కొన్ని కొన్ని చోట్ల షోస్ పడిన చోట్ల మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అయితే..ఈవెనింగ్ షోస్ పడేసరికి అన్నీ పాజిటివ్ గా మారాయి. పండగకు మీరు ఫ్యామిలీస్ తో చక్కగా వచ్చి మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా ఎంజాయ్ చెయ్యండి ,పాటలు, ఫైట్స్, కామెడీ, సెంటిమెంట్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న ప్రోపర్ పండగ సినిమా అండి.. దయచేసి ఏ మాటలు నమ్మకుండా ..మీరు ప్రాపర్ గా థియేటర్ కు వచ్చి సినిమా చూడండి.మీరు ఎంటర్టైన్ అవుతారని గ్యారంటీ నాది అంటూ నాగవంశీ మాట్లాడారు.
ఈ పండగకి ఎంజాయ్ చేసే సినిమా
దిల్ రాజు ఈ విషయంపై ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు. రాత్రి ఒంటి గంట షో అయిపోయాక కొంచెం మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినమాట వాస్తవమే అన్నారు. కానీ నాకు పర్సనల్‌గా సినిమా చూసినప్పుడు ఏదైతే ఫీల్ అయ్యానో దాన్నే మళ్లా క్రాస్ చెక్ చేసుకోవడానికి సుదర్శన్ థియేటర్లో మళ్ళీ రెండో సారి సినిమా చూశాను. ఇది ప్రాపర్ మహేష్ బాబు క్యారెక్టర్‌ను బేస్ చేసుకొని చేసిన సినిమా. తల్లి కొడుకుల మధ్య ఎమోషన్స్ ఉన్న సినిమా. ఖచ్చితంగా ప్రేక్షకులు ఈ నెగిటివ్ వైబ్స్, రివ్యూలు, టాక్‌లో నుంచి.. బాలేదంట అంటూ థియేటర్లోకి వెళ్లినా సినిమాలోని విషయం కనెక్ట్ అయితే సినిమా స్టాండ్ అవుతుంది. ఎన్నో సినిమాలు చూశాం.. అవన్నీ బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది పాజిటివ్ ఫిలిమ్. ప్రేక్షకులు ఈ పండగకి ఎంజాయ్ చేసే సినిమా." అంటూ దిల్ రాజు గుంటూరు కారం సినిమాపై వస్తోన్న నెగిటివ్ వైబ్స్ పై స్పందించారు.
బిజినెస్ ఛాలెంజెస్ ఉంటాయి
గుంటూరుకారం సినిమా కలక్షన్ల విష్యం గురించి మాట్లాడుతూ .. మహేష్ నటించిన గత చిత్రాల కలక్షన్లకు , ఈ సినిమా కలక్షన్లను ఒకసారి చూస్తే మిక్స్‌డ్ టాక్స్ పోతాయని దిల్ రాజు చెప్పారు. .. సినిమా బాగుంటే చూస్తారు.. బాగుండే సినిమాను ఏదైనా కానీ ఎవడూ ఆపడు.. అది చరిత్ర అంటూ ధీమాగా చెప్పారు. ప్రతి ఇయర్ సంక్రాంతి రాగానే మా అందరికీ యుద్ధం జరగడం సర్వ సాధారణం.. ఎందుకంటే అల్టిమేట్ ఇది వ్యాపారం.. ఇక్కడ ఎవరికి ఎవరూ శత్రువులు కాదు.. మిత్రులు కాదు.. సంక్రాంతి వచ్చినప్పుడు బిజినెస్ ఛాలెంజెస్ ఉంటాయి.. కాబట్టి వ్యాపారపరంగానే చేస్తాం.. ఇంక రెండు రోజుల తర్వాత ఈ టాపిక్స్ ఎవరూ మాట్లాడరు.. ఆ తర్వాత శుక్రవారం సినిమాల గురించే మనం మాట్లాడుకుంటాం.. అంటూ మీడియా సమావేశం లో మాట్లాడారు.
ALSO READ:HanuMan – Ayodhy Rama Mandir:అయోధ్య రామ మందిరానికి రూ 14 లక్షలు విరాళంగా ఇచ్చిన హను మాన్ మూవీ టీమ్