Watermelon: వేసవి వస్తోంది..ఈ సీజన్‌లో ఎక్కువ డిమాండ్ ఉండేది పుచ్చకాయలకే. ఎక్కడ చూసినా మనకు పుచ్చకాయలు గుట్టలుగా కనిపిస్తాయి. ఎందుకంటే వేసవి తాపాన్ని, దాహాన్ని తగ్గించడంలో పుచ్చకాయ బెస్ట్. వేసవికాలం శరీరంలో వాటర్ లెవెల్స్ ఎక్కువగా తగ్గిపోతూ ఉంటాయి. డీహైడ్రేషన్ పెరుగుతుంది. ఇలాంటప్పుడు వడదెబ్బ తగిలి కళ్ళు తిరిగి కింద పడిపోతాం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. అందుకే శరీరంలో వాటర్, షుగర్ లెవల్స్ తగ్గకుండా ఉండాలంటే పుచ్చకాయలు తినాలి. కానీ ఈ పండులో కొందరు వ్యాపారులు రసాయనాలు కలుపుతున్నారు. అవి తినడం వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయి.
పుచ్చకాయల్లో ఏ రసాయనాలు కలుపుతారు?
- మార్కెట్‌లో ఎర్రగా నిగనిగలాడే అన్ని పుచ్చకాయలు మంచివే అనుకోవద్దు. కార్బైడ్‌ను కలుపుతారు కావున అవి ఎర్రగా, తీయగా పండుతాయి. ఇది ఇథనాల్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. దీని ఫలితంగా పండ్లు త్వరగా పండుతాయి. అలాగే త్వరగా పక్వానికి రావడానికి, రంగు కోసం సుడాన్ రెడ్, మిథనాల్ ఎల్లో, మెర్క్యూరీ క్రోమెట్ వంటి రసాయనాలు కూడా ఉపయోగిస్తున్నారు.
నకిలీవి ఎలా గుర్తించాలి?
- బాగా పండిన పుచ్చకాయ గింజలు చాలా చిన్నవిగా ఉంటాయి. సహజంగా పండిన పుచ్చకాయ పండ్ల గింజలు నల్లగా ఉంటాయి. కట్ చేసిన పండు గుజ్జు రంగులో తేడా ఉంటుంది. కోసినప్పుడు విడిపోతే ఆ పుచ్చకాయలో కెమికల్ కంటెంట్ ఉందని చెప్పవచ్చు. ముక్కలుగా కట్ చేసినప్పుడు గుజ్జుగా కింద పడుతూ ఉంటే అది మంచిది కాదని అంటున్నారు.
ఎలా పరీక్షించాలి?
- కొనేముందు ఓపికగా పుచ్చకాయని పరిశీలిస్తే అందులో కెమికల్ కలిపారో లేదో కట్ చేయకపొయిన తెలుసుకొవచ్చు. పుచ్చకాయలో సూదితో పొడిచిన చిన్న రంధ్రం చేసి ఆ రంధ్రం లోంచి కెమికల్‌ని పుచ్చకాయలోకి వెక్కిస్తారు.. అందుకే కోనే ముందు పుచ్చకాయని చూట్టురా మొత్తం గమనించి తీసుకోవాలి. తెల్లటి మచ్చలు ఉన్న పండ్లపై రసాయనాలు స్ప్రే చేసినట్లు అర్థం. వాటిని చేతులతో తాకగానే మనకి పౌడర్ లాంటిది అంటుకుంటుంది. అలాంటివి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
కెమికల్స్ కలిపినవి తింటే?
- ఇలా కార్బైడ్‌తో చేసిన పండ్లను తినడం వల్ల కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతినంటంలోపాటు మిథనాల్ కాలేయం, కడుపు సమస్యలు, మెదడు దెబ్బతినడం, రక్తహీనత, సంతానోత్పత్తి తగ్గడం లాంటి సమస్యలను అధికంగా వస్తాయి.
ఇది కూడా చదవండి : అనుమానం వద్దు.. నమ్మకమే ముద్దు.. మీరు అలా చేయకండి!
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.