Budget 2024: ప్రజలను మోసగించిన బడ్జెట్‌- బెంగాల్ సిఎం మమత బెనర్జీ

కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జి తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్‌ పూర్తిగా రాజకీయ పక్షపాత వైఖరితో కూడిన బడ్జెట్‌ అని ఆమె మండిపడ్డారు.

New Update
Budget 2024: ప్రజలను మోసగించిన బడ్జెట్‌- బెంగాల్ సిఎం మమత బెనర్జీ

West Bengal CM Mamata Benarji: బీజేపీ నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన  బడ్జెట్‌కు ఒక దిక్కూదివానం లేదని, ఇది కేవలం పొలిటికల్‌ మిషన్‌ అని మమత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ బడ్జెట్‌ సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారని, కానీ ఇది పూర్తిగా అంధకార బడ్జెట్‌ అని దీదీ మమత విమర్శించారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు చాలా గొప్ప మాటలు మాట్లాడుతారని, ఒక్కసారి ఓట్లు పడ్డాయంటే వాళ్లు అన్నీ మర్చిపోతారని ఆమె ఫైరయ్యారు. డార్జిలింగ్‌, కలింపాంగ్‌ ప్రజలకు అధికార బీజేపీ ద్రోహం చేసిందని మండిపడ్డారు.

ఈ బడ్జెట్‌ సామాన్యులకు ఉపయోగపడే బడ్జెట్‌ కాదని, ఇది ప్రజా వ్యతిరేక, పేదల వ్యతిరేక బడ్జెట్‌ అని మమతాబెనర్జి విమర్శించారు. ఈ బడ్జెట్‌ కేవలం ఒక పార్టీకి మాత్రమే లబ్ధి చేకూర్చేలా ఉన్నదని, రాజకీయ పక్షపాతంతో అవసరమైన చోట అధిక కేటాయింపులు చేశారని, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మొండి చేయి చూపించారని విమర్శించారు.

Also Read:Telangana:అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ – కిషన్‌ రెడ్డి



Advertisment
తాజా కథనాలు