Diamonds : ఈమధ్య కాలంలో విదేశాల నుంచి అక్రమంగా భారత్(India) కు బంగారం(Gold), గంజాయి ని అక్రమంగా తరలించడం విపరీతంగా పెరిగిపోయింది. నిత్యం ఎక్కడో ఓ విమానశ్రయాల్లో నిందితులను అధికారులు పట్టుకుంటూనే ఉన్నారు. అయినా కూడా ఈ అక్రమ రవాణాలు మాత్రం ఆగడం లేదు. ఎయిర్‌పోర్టు(Airport) లో అధికారులకు చిక్కకుండా, గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోవచ్చని దుండగులు అనుకున్నప్పటికీ చివరికీ పోలీసులకు, అధికారులకు చిక్కుతున్నారు.
Also Read: టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్
అయితే తాజాగా హైదరాబాద్(Hyderabad) లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport) లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దాదాపు రూ.6 కోట్ల విలువైన వజ్రాలు(Diamonds), విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు దుబాయ్‌కు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అయితే వాళ్లిద్దరిపై అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని వారి సామాగ్రిని తనిఖీ చేశారు. చివరికి చాక్లెట్ కవర్లలో ప్యాక్ చేసిన రూ.6 కోట్ల విలువైన డైమాండ్స్, రూ.93 లక్షల విదేశీ కరెన్సీ, రూ.లక్ష నగదును గుర్తించారు. ప్రస్తుతం ఆ ప్రయాణికులిద్దర్నీ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
Also Read: అలా చేసినందుకే బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయింది: ప్రొ. కోదండరాం