Diabetes DryFruits: డయాబెటిక్ రోగులు ఈ డ్రై ఫ్రూట్స్ తినకూండ ఉంటే బెటర్.. ఎందుకో తెలుసా..!!

డయాబెటిక్‌ రోగులు డ్రై ఫ్రూట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. జీడిపప్పు, బాదం, వాల్నట్, పిస్తాపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ మాత్రమే ప్రయోజనకరంగా ఉంటాయి. ఎండుద్రాక్ష, అంజీర్ పండ్ల, ఖర్జూరం వంటికి దూరంగా ఉంటే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు.

Diabetes DryFruits: డయాబెటిక్ రోగులు ఈ డ్రై ఫ్రూట్స్ తినకూండ ఉంటే బెటర్.. ఎందుకో తెలుసా..!!
New Update

 Diabetes DryFruits: ఆరోగ్యకరమైన ఆహారం శరీర బలహీనతను తొలగిస్తుంది. డయాబెటిక్‌ రోగులు ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలో కొన్ని డౌట్స్‌ ఉంటాయి. డయాబెటిస్ అనేది ఒక వ్యాధి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, షుగర్ లెవెల్‌ను కంట్రోల్ చేస్తుంది. అందుకే షుగర్ పేషెంట్లు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్ రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ను చేర్చుకుంటే ఏంతో మేలు జరుగుతుంది. అయితే.. కొన్ని డ్రై ఫ్రూట్స్ డయాబెటిక్ వారి కోసం మాత్రమే ప్రయోజనకరంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ డ్రై ఫ్రూట్స్ తినాలి, ఏది తినకూడదో అనే విషయాలపై కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినే డ్రై ఫ్రూట్స్:

జీడిపప్పు:

  • జీడిపప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్‌లో కూడా దీన్ని తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ వీటిని రోజూతక్కవగా తీసుకుంటే బెస్ట్.

వాల్నట్:

  • విటమిన్-ఇ ఎక్కువగా ఉంటే వాల్‌నట్ డయాబెటిస్‌లో మంచిది. ఇది రిచ్ ఫైబర్, చాలా తక్కువ కేలరీలను అందిస్తుంది. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

పిస్తాపప్పు:

  • కాల్చిన పిస్తాలు రుచిలో ఉప్పగా ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ రోగులు కూడా వీటిని తినవచ్చు. పిస్తా తినడం ద్వారా బ్లడ్ షుగర్ కంట్రోల్‌ అవుతాయి. పిస్తాలో విటమిన్ సి, జింక్, కాపర్, పొటాషియం, ఐరన్, ఫైబర్, ప్రొటీన్, క్యాల్షియం అధికంగా ఉంటాయి కావున శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

బాదం:

  • ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మధుమేహంలోనే కాకుండా అనేక ఇతర వ్యాధులకు మేలు జరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ బాదంపప్పును తీసుకోవచ్చు. బాదం రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇది డయాబెటిక్ రోగులకు చాలా మంచిగా పని చేస్తాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని డ్రై ఫ్రూట్స్ :

  • మధుమేహంలో ఎండుద్రాక్ష తినడం మానుకోవాలి. ఒకవేళ తిన్నా 1,2 కంటే ఎక్కువ తినవద్దు. లేదంటే రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా అంజీర్ పండ్ల, ఖర్జూరం వంటికి దూరంగా ఉంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : నిద్రపోతున్నప్పుడు అధిక రక్తపోటు సంకేతాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి..!!

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #health-care #diabetes #dryfruits #best-health-tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe