Blakc tea & green tea: బ్లాక్ టీ, గ్రీన్‌ టీ షుగర్‌ ని తగ్గిస్తాయా..వైద్యులు ఏం అంటున్నారంటే!

కొంత కాలం ముందు వరకు కూడా టీ (Tea) అంటే కేవలం పాలు, టీపొడి, పంచదార మాత్రమే...కానీ ఇప్పుడు టీలో ఎన్ని రకాలో వచ్చాయో చెప్పడానికే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే టీ లో అన్ని రకాలు వచ్చాయి మరీ. వాటిలో గ్రీన్‌ టీ(Green Tea), బ్లాక్ టీ (Black Tea) చాలా ముఖ్యమైనవి. ఇవి రెండు మధుమేహన్ని (diabaties) తగ్గించడంలో చాలా ఉపయోగపడుతున్నట్లు తెలుస్తుంది.

New Update
Blakc tea & green tea: బ్లాక్ టీ, గ్రీన్‌ టీ షుగర్‌ ని తగ్గిస్తాయా..వైద్యులు ఏం అంటున్నారంటే!

కొంత కాలం ముందు వరకు కూడా టీ (Tea) అంటే కేవలం పాలు, టీపొడి, పంచదార మాత్రమే...కానీ ఇప్పుడు టీలో ఎన్ని రకాలో వచ్చాయో చెప్పడానికే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే టీ లో అన్ని రకాలు వచ్చాయి మరీ. వాటిలో గ్రీన్‌ టీ(Green Tea), బ్లాక్ టీ (Black Tea) చాలా ముఖ్యమైనవి. ఇవి రెండు మధుమేహన్ని (diabaties) తగ్గించడంలో చాలా ఉపయోగపడుతున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుత రోజుల్లో షుగర్‌ అనేది ప్రతి 10 మందిలో 8 మందికి ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా వస్తున్న వ్యాధి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, ఊబకాయం వంటివి డయాబెటిస్‌ కి ముఖ్య కారణం అవుతున్నాయి. ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయి. టైప్‌ 1 డయాబెటిస్‌, టైప్‌ 2 డయాబెటిస్.

Also read: ఎన్నికల ముహుర్తం ఫిక్స్…ఎలక్షన్ డేట్ ఎప్పుడంటే?

వీటిని నిర్మూలించడానికి కొన్ని సులభమైన చిట్కాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి గ్రీన్‌ టీ, బ్లాక్ టీ. ఇవి రెండు తాగడం వల్ల షుగర్‌ ని కంట్రోల్‌ లో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా టైప్‌ 2 డయాబెటిస్‌ వారికి గ్రీన్‌ టీ అనేది అద్భుత ఔషధంగా పని చేస్తుంది. సన్నబడాలి అనుకునే వారికి గ్రీన్‌ టీ దివ్య ఔషధంగా చెప్పవచ్చు. ఈ టీని రోజూ తాగితే..గుండె పదికాలాల పాటు పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు.

అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బీపీ ఉన్న వారు కూడా రోజూ క్రమం తప్పకుండా ఈ టీని తీసుకుంటే బీపీ అదుపులో ఉండటంతో పాటు...క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి. దీనిని రోజూ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్‌ అదుపులో ఉంటాయి.

గ్రీన్‌ టీ లో కొటేకిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. బీపీ ని తగ్గిస్తుంది. కార్బొహైడ్రేట్లను త్వరగా జీర్ణం కానివ్వకుండా ఉంచడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. బ‌రువు ఎప్పుడైతే తగ్గుతుందో..ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గుతుంది. శ‌రీరంలో ఉన్న ఇన్సులిన్ పూర్తిగా వినియోగమౌతుంది. ఫలితంగా ర‌క్తంలో షుగ‌ర్ లెవెల్స్ త‌గ్గుతాయి. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు రోజూ 2-3 కప్పుల గ్రీన్ టీ తాగితే మంచిది.

Also read: పావురం మీ ఇంట్లో ఈ దిక్కున గూడు పెట్టిందా..అయితే మీరు!

బ్లాక్ టీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. షుగర్‌ ను నియంత్రణలో ఉంచే సామర్థ్యం బ్లాక్‌ టీ కి ఉన్నట్లు తెలుస్తుంది. ప్రీ డయాబెటిక్‌ రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది. బ్లాక్ టీ ని తరుచుగా తీసుకోవడం వల్ల టైప్‌ 2 షుగర్‌ తగ్గుతుంది. బ్లాక్ టీ సహజంగా ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది.

పాలీఫెనాల్ రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది.యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి ఈ కణాలు కలిగించే హాని నుంచి మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. బ్లాక్ టీలో అత్యంత సాధారణ యాంటీ ఆక్సిడెంట్లలో కొన్ని పాలీఫెనాల్ మరియు థెఫ్లావిన్స్. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Also read: ఐదంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం..!!

Advertisment
తాజా కథనాలు