NEET Scam: నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలితే.. ఎవరినీ వదిలేది లేదు: ధర్మేంద్ర ప్రధాన్

నీట్‌ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయితే.. దీనికి బాధ్యులైన ఎన్‌టీఏ అధికారులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నీట్‌ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.

New Update
NEET Scam: నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలితే.. ఎవరినీ వదిలేది లేదు: ధర్మేంద్ర ప్రధాన్

నీట్‌ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు తేలితే.. దీనికి బాధ్యులైన ఎన్‌టీఏ అధికారులను ఉపేక్షించేది లేదని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నీట్‌ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఈ పరీక్షలో అక్రమాలకు పాల్పట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలకు అనుగూణంగా 1563 మంది అభ్యర్థులను తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Also read: ఢిల్లీలో నీటి సంక్షోభం.. అల్లాడిపోతున్న నగర ప్రజలు

రెండు చోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని.. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. అలాగే ఎన్‌టీఏలో ప్రక్షాళన అవసరమని.. ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పుడు నీట్ యూజీ 2024లో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థుల ముందు రెండు మార్గాలు ఉన్నాయన్నారు. ఈనెల 23న మళ్లీ పరీక్ష రాసి జూన్ 30న వాటిలో వచ్చే మార్కులు పొందడం.. లేదా గ్రేస్ మార్కులు లేకుండా ఇప్పుడు వచ్చిన మార్కులను ఆమోదించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇక నీట్‌ క్వశ్చన్ పేపర్‌ లీక్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.

Also read: గంగానదిలో పడవ ప్రమాదం.. ఆరుగురు గల్లంతు!

Advertisment
తాజా కథనాలు