Rahul Gandhi: అస్సాంలో రాహుల్ న్యాయయాత్ర అడ్డగింపు..ఉద్రిక్తత

కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్నారు. ఆయన ఈరోజు అస్సాంలో న్యాయ్ యాత్రను నిర్వహించారు. అయితే దీనిని అక్కడి పోలీసులు అడ్డగించడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

New Update
Rahul Gandhi: అస్సాంలో రాహుల్ న్యాయయాత్ర అడ్డగింపు..ఉద్రిక్తత

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) కొనసాగుతోంది. జనవరి 14న మొదలైన న్యాయ్ యాత్ర మార్చి 20న ముగియనుంది.నిరుద్యోగిత, పెరిగిన ధరలు, సామజిక న్యాయం పలు కీలక సమస్యలు సహా పలు స్థానికి సమస్యలను ఆలకిస్తూ రాహుల్ గాంధీ ఈ యాత్రను ముందుకు తీసుకెళ్లానున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 100 లోక్‌ సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6713కిలోమీటర్లు రాహుల్ కవర్‌ చేయనుంది. రాహుల్ గాంధీ యాత్రకు కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లను చేపట్టింది. మణిపూర్‌లో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం అయింది.

Also Read:అయోధ్య రామునికి ఏడువారాల నగలు.. వాటి విలువ ఎంతో తెలుసా..

అస్సాంలో రాహుల్‌ను అడ్డుకున్న పోలీసులు

భారత్‌ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఈరోజు అస్సాంలో (Assam) పర్యటించారు. నిన్న నాగాలాండ్ లో పర్యటించిన ఆయన నిన్న మధ్యాహ్నానికే అస్సాం చేరుకున్నారు. ఈరోజు ఉదయం ఇరు రాష్ట్రాల బోర్డ్ర్‌లో యువకులతో ముచ్చటించిన రాహుల్ అస్సాంలోని గువాహటి (Guwahati)  బయలుదేరారు. అయితే, కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) యాత్రకు అస్సాం ప్రభుత్వం ముందు నుంచీ అనుమతి ఇవ్వలేదు. తమ యాత్ర మార్గాన్ని మార్చుకోవాలని ఆదేశించింది. ట్రాఫిక్‌ కారణాల దృష్ట్యా గువాహటిలో యాత్రకు అనుమతించడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) చెప్పారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తులు ఇదేమీ పట్టించుకోకుండా గుహావాటికి చేరుకున్నారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తకలు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇది జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ అక్కడే ఉన్నారు. ఘర్షణ కారణంగా కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులునెలకొన్నాయి.

మాకు మాత్రమే ఎందుకు...

కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్రను అడ్డకోవడం మీద రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇదే మార్గంలో బీజేపీ నేతలు బజరంగ్‌ దళ్ యాత్ర చేసినప్పుడు అడ్డుకోలేదు. బీజీఏపీ ఛీఫ్ నడ్డా కూడా యాత్ర నిర్వహించారు. అప్పడు వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఇప్పడు తమను మాత్రం ఆపుతున్నారు. బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు అంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. మేము చట్టాన్ని అతిక్రమించి ఏ పనీ చేయము అని చెప్పారు.

రాహుల్ మీద కేసు..

రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద అస్సాం ముఖ్యమంత్రి హిమంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ మీద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. మాది శాంతియుత రాష్ట్రం. ఇలాంటి గొడవలకు మేము చాలా దూరంగా ఉంటాం. ఘర్షణలు జరిగేలా కార్యకర్తలను రెచ్చగొట్టినందుకు గానూ రాహుల్‌ గాంధీపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించా. కాంగ్రెస్‌ తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన వీడియోలనే సాక్ష్యాలుగా పరిగణించాలని చెప్పానని హిమంత తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు