Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. బలవుతున్న అమాయక ప్రజలు

ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరులో బలైపోతున్న సామాన్యులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గాజా గడ్డపై నెత్తుటి ప్రవాహానికి కారణం ఎవరు? ఈ విధ్వంసం ఆగేదెప్పుడు? అంతర్జాతీయ సమాజం పాలస్తీనా పక్షాన నిలపడుతుందా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. బలవుతున్న అమాయక ప్రజలు
New Update

Israel - Hamas War: రహదారుల నిండా బుల్లెట్లు.. బడికెళ్లే పిల్లల బూట్ల నిండా అమాయకపు రక్తం.. ఆకాశం నిండా బూడిద రంగు పొగలు.. ఏ సమయంలో ఏ బాంబు నెత్తి మీద పడుతుందో తెలియదు.. ఎవరు ఎటు వైపు నుంచి దాడి చేస్తారో అర్థంకాదు.. ఇది గాయపడ్డ గాజా పరిస్థితి.. ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరులో నలిగిపోతున్న, బలైపోతున్న సామాన్యులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇరు వర్గాల యుద్ధంలో మానవ హక్కుల ఉల్లంఘనదే అధిక భాగం. ఇంతకీ గాజా గడ్డపై ఈ నెత్తుటి ప్రవాహానికి కారణం ఎవరు? ఈ విధ్వంసం ఆగేదెప్పుడు? అటు అంతర్జాతీయ సమాజం క్రమక్రమంగా ఈ పోరులో పాలస్తీనా పక్షాన నిలపడుతుందా? వాచ్‌ థిస్‌ స్టోరీ..!

యుద్ధంలో బలవుతున్న అమాయక ప్రజలు

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య అక్టోబర్‌ 7, 2023 నుంచి జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధంలో మే 28, 2024నాటికి గాజా, వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతాల్లో దాదాపు 36 వేల మంది చనిపోయినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారని యూనిసేఫ్‌ చెబుతోంది. పసిబిడ్డల రక్తాలతో పాలస్తీనా గడ్డ తడవని రోజే లేదు. 2024 మార్చి 17నాటికి యూనిసేఫ్‌ లెక్కల ప్రకారం దాదాపు 13 వేల మంది చిన్నారులు ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించారు. మిగిలిన చిన్నారులు అనాధలుగా మారారు. అక్టోబర్‌ 7, 2023న ముందుగా హమాస్‌ ఇజ్రాయెల్‌ స్థావరాలపై దాడి చేసిందని అందుకే తప్పంతా హమాస్‌దేనని వెస్ట్రన్‌ మీడియా ముందు నుంచి ప్రచారం చేస్తూ వస్తోంది. హమాస్‌ దాడిలో ఇజ్రాయెల్‌ పౌరులు చనిపోయిన విషయం నిజమే కావొచ్చు.. ఈ ఘటనను, ఆ మరణాలను ఎవరూ సమర్థించడంలేదు కూడా...! కానీ ఆ తర్వాత ప్రతీకారం పేరుతో గాజా గడ్డపై ఇజ్రాయెల్‌ చేసిన నరమేధం ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ పాలస్తీనా పౌరులకు తిండి లేదు.. తాగడానికి నీరు దొరకడం లేదు.. వైద్యం అందడం లేదు.. ఇదంతా ఎవరి పాపం?

Also Read: అప్పుడు మీ అందరి కళ్లు ఎక్కడ ఉన్నాయి…ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా పై ఇజ్రాయిల్‌ సీరియస్‌!

1948కి ముందు ఇజ్రాయేల్ దేశం లేదు

ఓవైపు అమెరికా, దాని మిత్రదేశాలు పాలస్తీనాను ఏకాకి చేసేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా మరోవైపు పౌర సమాజం మాత్రం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతోంది. మే 26, 2024న హమాస్‌పై ప్రతీకారం పేరుతో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 81 మంది సామాన్యులు చనిపోయినట్టుగా పలు మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ దాడిని ఖండిస్తూ ఇండియా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రజలు పాలస్తీనాకు సంఘీభావంగా నిలుస్తున్నారు. 'All eyes on Rafah' హ్యాష్‌ట్యాగ్‌తో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పాలస్తీనాకు మద్దతు ప్రకటిస్తున్నారు. నిజానికి 1948 ముందు వరకు ఇజ్రాయెల్‌ అనే దేశమే లేదు.. యూదులపై నాజీల ఊచకోత సమయంలో వారంతా పాలస్తీనాలో రక్షణ పొందారు. క్రమక్రమంగా అరబ్బు నేలను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాలు అమెరికాను ప్రపంచంలో బలమైన దేశంగా నిలబెట్టాయి. అమెరికా అండదండలతో యూదులు తమకు తాముగా ఇజ్రాయెల్‌ అనే పేరుతో ఓ దేశాన్ని ప్రకటించుకున్నారు.. అప్పటినుంచి పాలస్తీనా పౌరులకు నిలువనీడ లేకుండా పోయింది. ఇజ్రాయెల్‌ దళల నుంచి తమను తాము రక్షించుకునేందుకు పొరుగు దేశాలైన ఈజిప్ట్‌, లెబనాన్‌, జోర్డాన్‌లో పాలస్తీనియన్లు తలదాల్చుకోవాల్సి వచ్చింది.

దశాబ్దాలుగా కొనసాగుతున్న పోరు

తమ మాతృభూమిపై మమకారం, తిరిగి దాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో పాలస్తీనియన్లు ఏడున్నర దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేశారు. పాలస్తీనా విమోచనానికి యాసర్‌ అరాఫత్‌ నాయకత్వంలో పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌-PLO ఏర్పడింది. ఇది చాలా కాలం పాటు సాయుధ మార్గంలో పోరాటాలు చేసింది.. సంప్రదింపులూ చేసింది. అయినా ఫలితం దక్కలేదు.. ఈ క్రమంలోనే హమాస్‌ లాంటి గ్రుపులు పుట్టుకొచ్చాయి.. దీనికి పాలస్తీనియన్ల నుంచి గట్టి మద్దతు లభించింది. ఇలా హమాస్‌ వర్సెస్‌ ఇజ్రాయెల్‌ పోరు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇరు వర్గాల యుద్ధంలో బలైపోతున్న అమాయకుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. అటు తల్లిదండ్రుల కోల్పోతున్న పిల్లలు.. పిల్లలను కోల్పోయిన బాధలో తల్లిదండ్రుల దయనీయ ఆర్తనాదాలూ చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.

Also Read: బ్రిటన్‌ పార్లమెంటు రద్దు.. ఎన్నికల ప్రచారం ప్రారంభం

గాజాలో తల్లులు తమ పిల్లలకు కంకణాలు కడుతున్నారు. ఇజ్రాయెల్‌ బాంబు దాడుల్లో మరణిస్తే.. ప్రాణాలు కోల్పోయిన తమ పిల్లల మృతదేహాలనైనా గుర్తుపట్టి కడచూపుకు నోచుకోవాలన్న ఆశ వారిది. మానవ హక్కులను ఇరు వర్గాల గ్రూపులు ఇంతలా కాలరాస్తున్నా అగ్రదేశాలుగా చెప్పుకునే పలు రాజ్యాలు మాత్రం ఇప్పటికీ పాలస్తీనాలో జరుగుతున్నదంతా సాధారణ యుద్ధమేనని బుకాయిస్తూండడం నిజంగా విడ్డూరం!

#telugu-news #gaza #israel-hamas-war #israel-hamas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe