Devara Release Date Changed : కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) హీరోగా నటిస్తున్న 'దేవర' మూవీ రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. పార్ట్- 1 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్ లోనే రావాల్సిన ఈ సినిమాని పలు అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 10 న విడుదల చేస్తున్నట్లు మూవీ టీమ్ రీసెంట్ గానే అధికారికంగా ప్రకటిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అంతకంటే ముందుగానే థియేటర్స్ లో సందడి చేయనుంది.
రెండు వారాల ముందే...
సెప్టెంబరు 27న ‘దేవర’ (Devara) పార్ట్ 1ను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేసింది. మరోవైపు, పవన్ కల్యాణ్ నటిస్తున్న 'ఓజీ' సెప్టెంబరు 27నే ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకా చిత్రీకరణ మిగిలిఉంది. ‘దేవర’ ప్రకటనతో ‘ఓజీ’ వాయిదా పడినట్టే అని స్పష్టమవుతోంది. ఈ న్యూస్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ న్యూస్ విని ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Also Read : ‘చెప్పను బ్రదర్’.. ఈ డైలాగే మెగా ఫ్యామిలీకి బన్నీని దూరం చేసిందా!?
సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Sending a Warning Notice to all coasts about his early arrival ⚠️⚠️
Man of Masses @Tarak9999's #Devara in cinemas from 𝐒𝐞𝐩𝐭𝐞𝐦𝐛𝐞𝐫 𝟐𝟕𝐭𝐡! 🔥🔥#DevaraOnSep27th 🌊#KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad… pic.twitter.com/eHlPQ6Z89M
— NTR Arts (@NTRArtsOfficial) June 13, 2024