'దేవర'.. రిలీజ్ కు ముందే భారీ ధరకు కొనేసిన ఓటీటీ ప్లాట్ ఫామ్!

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న 'దేవర' నుంచి మరో బిగ్ అప్ డేట్ ఇచ్చారు మూవీ నిర్మాత కల్యాణ్ రామ్. ఈ సినిమా ఓటీటీ డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందని తెలిపారు. మూవీ షూటింగ్ 80 శాతం పూర్తైందని, త్వరలోనే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేస్తామన్నారు.

New Update
'దేవర'.. రిలీజ్ కు ముందే భారీ ధరకు కొనేసిన ఓటీటీ ప్లాట్ ఫామ్!

Devara : జూనియర్ ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో రాబోతున్న 'దేవర'(Devara)మూవీకి సంబంధించి మరో బిగ్ అప్ డేట్ వెలువడింది. సూపర్ హిట్ జోడీగా పేరుపొందిన తారక్, కొరటాల కాంబోపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోగా.. ఇటీవల విడుదలైన దేవర ఫస్ట్ లుక్స్, పోస్టర్స్ అభినుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ మూవీని కొరటాల సైతం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తెరకెక్కిస్తుండగా భారీ బడ్జెట్ తో నందమూరీ కల్యాణ్ రామ్(Kalyan ram) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే కొంతకాలంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్(OTT Rights) అమ్ముడుపోయాయంటూ కల్యాణ్ రామ్ వెల్లడించారు.

ఈ మేరకు కల్యాణ్ రామ్ నటించిన 'డెవిల్' డిసెంబర్ 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తున్న ఆయన.. రీసెంట్ ఇంటర్వ్యూలో 'దేవర' మూవీపై కూడా పలు అప్‌డేట్స్ ఇచ్చాడు. ''దేవర' మూవీ షూటింగ్ 80 శాతం పూర్తైంది. త్వరలోనే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయబోతున్నాం. వీఎఫ్ఎక్స్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ సీఈవో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనతో జరిపిన చర్చలు జరిపి ఫైనల్ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు టెడ్ సరండోస్ తో కలిసినప్పుడు ఆయనతో నెట్‌ఫ్లిక్స్ ఎలా మొదలైంది? ఎలా వరల్డ్ వైడ్ పాపులారిటీ చెందుతుందనే విషయంపై కూడా మాట్లాడుకున్నాం. ఆయనతో మాట్లాడుతుంటే మంచి ఫీలింగ్ కలిగింది' అని కల్యాణ్ రామ్ తెలిపారు.

ఇది కూడా చదవండి : రహస్యంగా పెళ్లి చేసుకున్నశృతి హాసన్.. నెట్టింట ఫ్యాన్స్ రచ్చ

ఇక దేవర సినిమా రెండు భాగాలుగా రాబోతుండగా ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో బాలీవుడ్(Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. శ్రీకాంత్, సైఫ్‌ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, మురళి శర్మ, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు