NTR DEVARA: దేవర మూవీ రిలీజ్ వాయిదాలో నిజమెంత? ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న దేవర మూవీ ముందుగా మేకర్స్ ప్రకటించినట్లుగా ఏప్రిల్ 5 న రిలీజ్ కాదని, ఈ మూవీలో భారీ వీఎఫ్‌ఎక్స్ కోసం టైం కావాలని, అదే టైమ్లో ఏపి లో ఎన్నికలు కూడా జరుగుతాయి కాబట్టి .. ఈ సినిమా వాయిదా వేయనున్నారని టాక్ వినిపిస్తోంది. By Nedunuri Srinivas 25 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి NTR DEVARA: యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఆత్యంత బారీ ప్రమాణాలతో రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి మొన్న విడుదలయిన గ్లింప్స్ కు అల్టిమేట్ రెస్పాన్స్ వస్తోంది. రెండు బాగాలుగా తెరకెక్కిస్తున దేవర మూవీ ఫస్ట్ పార్ట్ ను ఈ ఏడాది ఏప్రిల్ 5 న రిలీజ్ చేసేందుకు సిద్ధమని మేకర్స్ అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. రిలిజ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న యంగ్ టైగర్ అభిమానులకు నిరాశే ఎదురయ్యే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి .. దేవర మూవీ రిలీజ్ ఎప్పుడు ? దేవర గ్లిమ్ప్ చూస్తుంటే భారీ వీఎఫ్‌ఎక్స్ ఉన్నట్లు అర్ధమవుతోంది.అనుకున్నట్లుగానే ఈ మూవీలో వీఎఫ్‌ఎక్స్ వర్క్ కు అత్యంత ప్రాదాన్యతనిస్తున్నారని సమాచారం. అయితీ .. ఎక్కడా రాజీపడకుండా క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చేందుకు మేకర్స్ స్రమిస్తున్నారట. అందుకోసమే రిలీజ్ డేట్ కు ఓ రెండునెలల తరువాత రిలీజ్ చేద్ధామని ప్లాన్చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి అయినప్పటికి, ఇంకా 45రోజుల పాటు షూటింగ్ బ్యాలేన్సే ఉందని తెలుస్తోంది. అయితే .. ఇది ఒక కారణం మాత్రమె అని తెలుస్తోంది. అంరో కారణం మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అని సమాచారం. ఎన్నికల ఎఫెక్ట్ ఏపి అసెంబ్లీ ఎన్నికలు రాబోయే మార్చినెలలో జరగనున్నాయి.ఎన్నికల నోటిఫికేషన్ కూడా అతి తొందరలో వెలువడే అవకాశాలున్నాయి.సో.. ఎన్నికల హాడావుడి మొదలయితే ఎంతటి గొప్ప సినిమా అయినా నలిగిపోవడం ఖాయం. పైగా ఎన్టీఆర్ లాంటి స్టార్ హిరో కాబట్టి పొలిటికల్గా కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మార్చి నెలాఖరుకల్లా ఎన్నికలు జరగవచ్చు.ఏప్రిల్ 5న దేవర రిలీజ్ అయితే ఎన్నికల కౌంటింగ్ , కొత్త ప్రభుత్వం ఏర్పాటు తదితర పొలిటికల్ కార్యక్రమాలపై అందరి ద్రుష్టి ఉంటుంది. ఇలాంటి టైమ్లో రిలీజ్ చేయడం సరికాదని అందుకే మరో రెండు నెలలు వాయిదా వేసి జూన్ నెలలో మూవీని రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాంటే దేవర మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చేవరకు వేచి చూడాలి. దేవరకు ఎన్నో సవాళ్ళు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత కోరటాల శివ – ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న మూవీ కావడం ఒక ఎత్తు అయితే .. త్రిబుల్ ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తోన్న పాన్ ఇండియా మూవీ ఇదే కావడం , జక్కన్న ఫ్లాప్ సెంటిమెంట్ ను అధిగమించడం ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది. పైగా ఆచార్య లాంటి డిజాస్టర్ తరువాత కొరటాల చేస్తోన్న మూవీ కావడంతో అందరిలోనూ ఈ దేవర పై ఆసక్తి పెరిగింది. అందుకే .. దేవర మూవీని ఖచ్చితంగా హిట్ చేసేందుకు తగిన శ్రద్ద తీసుకుంటున్నారు మేకర్స్. దేవర మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. తంగం అనే ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు. ALSO READ: నిఘా నీడలో ఉప్పల్ స్టేడియం –వివరాలు వెల్లడించిన రాచకొండ సిపీ సుదీర్ బాబు #ntr #devara-reease-date #devara-glimpse #janvi-kapoor #koratala-siva మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి