/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-4-4-jpg.webp)
NTR Support To Hanuman : ఓ వైపు సంక్రాంతి(Sankranti) సినిమాల ప్రమోషన్లతో , అంతా సందడి సందడి గా ఉంది. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) దేవర మూవీ నుంచి రిలీజయిన గ్లింప్స్ ట్రెండ్ అవుతోంది. కేవలం డిజిటల్ ప్రమోషన్(Digital Promotion) తో ఇంతటి అప్లాజ్ వస్తే.. థియేటర్ లో రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ కు పూనకాలు పుట్టడం ఖాయం. సరిగ్గా ఈ ఆలోచనతోనే థియేటర్స్ లో గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
Watch the epic tale of the ultimate superhero a day in advance ❤️🔥#HanuMan Grand Premiere shows on January 11th.
Bookings open today from 11 AM 💥Nizam Release by @MythriOfficial ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) January 9, 2024
ఈ నెల 11 ఈవెనింగ్ షోలతో హనుమాన్ ప్రారంభం.. ఒక్క రోజు ముందే రిలీజ్
ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తోన్న సినిమా హనుమాన్(Hanuman). పెద్ద సినిమాల హడావుడి నడుస్తున్న తరుణంలో చిన్న సినిమాగా వచ్చి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. గుంటూరు కారం మూవీ ఈ నెల 12 న రిలీజ్ అవుతుండగా ఈ హనుమాన్ మూవీ కూడా అదే డేట్ కు రావడంతో థియేటర్స్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే 11వ తేదీ ఈవెనింగ్ షో నుంచి హనుమాన్ షోలు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శిస్తున్నారు. హనుమాన్ ను 12వ తేదీన చూడాలని అనుకునేవారికి ఎలాంటి ట్రబుల్ లేకుండా ఒకరోజు ముందే హనుమాన్ మూవీ చూసే విధంగా మేకర్స్ ప్లాన్ చేసారు.
హనుమాన్ కోసం అండగా దేవర
చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ..యంగ్ టైగర్ ఎన్టీఆర్ హనుమాన్ కోసం అండగా నిలపడనున్నారు. హనుమాన్ మూవీ ఆడే థియేటర్స్ లో (Devara) దేవర గ్లింప్స్ ప్లే చేస్తారని సమాచారం. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ థియేటర్ గ్లింప్స్ చూడటానికి ఖచ్చితంగా వస్తారు. హనుమాన్ సినిమాకు కొద్హిగా ప్లస్ అవుతుందని ఈ విధంగా ప్లాన్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా(Social Media) లో ఎక్కడ చూసిన హనుమాన్ మ్యానియా నడుస్తోంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ సన్నాహాలతో వార్తలు వైరల్ అవుతుండగా , తేజ సజ్జ చిన్నప్పుడు నటించిన చిత్రాల క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. చెప్పుకోదగ్గ విషయం మరొకటి ఉంది.. హనుమాన్ మూవీ కోసం ఇతర భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక.ఏ సినిమాకయినా పాజిటివ్ టాక్ ముఖ్యం,. ఇక.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే మాత్రం థియేటర్స్ సంఖ్య పెంచడం ఖాయం . చూడాలి మరి .. దేవర గ్లింప్స్ ఏ మేరకు సహాయపడుతుందో.
ALSO READ : AYODHYA RAM MANDIR : అయోధ్య రామమందిరానికి విరాళం ప్రకటించిన హను మాన్ మూవీ టీమ్