Summer Drinks : ఎండలు మండిపోతున్నాయి. శరీరంలో ఎనర్జీ కోసం చాలామంది ఎన్నో పానియాలు తీసుకుంటారు. అయితే డీటాక్స్ పానియాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలని తొలగించి జీర్ణక్రియ సాఫీగా చేసేలా ఉపకరిస్తాయి. డీటాక్స్ డ్రింక్స్(Detox Drinks) దాహాన్ని తీర్చడంతో పాటు ఉక్కపోత వల్ల చెమటల కారణంగా కోల్పోయిన పోషకాలు, లవణాలు ఇంకా అత్యవసర పోషకాలను అందిస్తాయి.
Also Read: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ టీని తాగితే..బరువు తగ్గడమే కాకుండా ఈ వ్యాధులు కూడా దూరం అవుతాయి!
డిజిటల్ క్రియేటర్ అయిన ఏన్షియంట్ డిగిన్(Ancient Degin) అనే వ్యక్తి మెరుగైన జీర్ణక్రియ కోసం బీట్రూట్, జింజర్ డీటాక్స్ డ్రింక్ రెసిపీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బీట్రూట్, పసుపు, అల్లం, బ్లాక్ పేపర్లతో ఈ డ్రింక్‌ను తయారుచేసుకునేలా వివరిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ డీటాక్స్ డ్రింక్స్ అనేవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు యాంటి ఇన్‌ఫ్లమేషన్ గుణాలతో సహా.. యాంటీఆక్సిడెంట్స్‌ను కలిగి ఉండటంతో శరీర ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.
ఇక బ్లాక్ పెప్పర్ వాడటం వల్ల శరీరం పోషకాలను మెరుగ్గా సంగ్రహించే సామర్ధ్యం వస్తుంది. అలాగే , కొత్తిమీర డీటాక్స్ డ్రింక్, అల్లం టీ, తేనె నిమ్మరసం, కుకుంబర్ కివీ జ్యూస్ లాంటి డీటాక్స్ డ్రింక్స్‌ను తీసుకుంటే వేసవిలో డీహైడ్రేషన్ బారినపడకుండా కాపడటంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని న్యూట్రిషనిస్ట్‌లు చెబుతున్నారు.
Also Read: లవంగాలు తింటే ఈ సమస్యలన్నీ దూరం.