Andhra Pradesh: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 11 రోజులపాటు దీక్ష చేయనున్నారు. ఈ సమయంలో పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారని తెలుస్తోంది.

New Update
Andhra Pradesh: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష

Deputy CM Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. ఈ నెల 26 నుంచి 11 రోజల పాటూ దీక్షను చేపట్టనున్నారు. దీనికి సంబంధించి పత్రికా ప్రకటనను విడుదల చేశారు. గత ఏడాది జూన్ నెలలో పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్ర (Varahi Vijaya Yatra) చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు కృతజ్ఞతగా మళ్ళీ అదే దీక్ష (Varahi Ammavari Deeksha) చేపట్టినట్టు తెలుస్తోంది. దీక్ష సమయంలో పవన్ పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు.

ఈసారి ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ అన్ని రకాలుగా విజయం సాధించారు. ప‌రతిపక్షాల ఓట్లు చీలకుండా చూస‌తానని అన్న ఆయన టీడీపీ, బీజేపీ, జనసేనలను ఏకం చేశారు. కూటమి గెలుపుకు అన్ని రకాలుగా కృషి చేశారు. కూటమి విజయంలో వారాహి విజయ యాత్ర కీలక భూమిక పోషించిందని చెబుతారు.. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని అందుకోవడం.. జనసేన (Janasena) పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయ కేతనం ఎగరవేయడంతో ఆ పార్టీ శ్రేణులు ఫుల్‌ ఖుషిలో ఉన్నారు. ఇదంతా వారాహి అమ్మవారి దయవల్లనే జరిగిందని పవన్ నమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు ఆ అ్మవారి దీక్షను మళ్ళీ చేపట్టారని చెబుతున్నారు.

Also Read: Gujarat: రీల్స్‌ పిచ్చి..కార్లతో సముద్రంలోకి..

Advertisment
Advertisment
తాజా కథనాలు