Gujarat: రీల్స్ పిచ్చి..కార్లతో సముద్రంలోకి.. ఈమధ్య కాలంలో రీల్స్ పిచ్చి ఎంతలా ఎక్కువైపోయిందో తెలయజెప్పే సంఘటనలు చానే చూస్తుననాం. దానికోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారూ ఉంటున్నారు. అయినా కూడా జనాలకు బుద్ధ రావడం లేదు. దానికి ఈ కింది సంఘటనే ఉదాహరణ. By Manogna alamuru 25 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Social Media Addiction: పిచ్చికి పరాకాష్ట సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలని కోరిక. రాత్రికిరాత్రే స్టార్స్ అయిపోయేందుకు కొందరు యువతీయువకులు విపరీత సాహసాలు చేస్తున్నారు. ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నాం అన్న సోయ లేకుండా ప్రమాదకరమైన రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇద్దరు వ్యక్తులు ఇన్‌స్టా రీల్స్ కోసం విన్యాసాలు చేస్తూ తమ వాహనాలను ఏకంగా సముద్రంలోకి పోనిచ్చారు. గుజరాత్‌లోని కచ్‌లో గల ముంద్రా సముద్రతీరానికి ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్లారు. అక్కడ రీల్స్ చేసేందుకు తమ ఎస్యూవీ వాహనాలను సముద్రంలోకి పోనిచ్చారు. చాలా దూరం వరకూ వాహనాలను తీసుకెళ్లారు. అయితే, అలల కారణంగా రెండు థార్ వాహనాలు నీటి చిక్కుకుపోయాయి. ఎటూ కదల్లేక ఇరుక్కుపోయాయి. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ఆపసోపాలూ పడ్డారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి స్థానికుల సాయంతో ఎలాగోలా వారి వాహనాలు సముద్రం నుంచి ఒడ్డుకు చేర్చగలిగారు. ఒడ్డుకు వచ్చాక వీరిద్దరి మీదా కచ్ పోలీసులు ఇద్దరి వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత రీల్స్ కోసం ఉపయోగించిన రెండు ఎస్యూవీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు యువకులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు పోలీసు అధికారి తెలిపారు. Also Read:Mamatha Benarji: జల ఒప్పందానికి ఒప్పుకోము..ప్రధాని మోదీతో మమతాబెనర్జీ #reels #gujarat #kuch #cars #sea మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి