Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు (Assembly Meetings) జరుగుతున్నాయి. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మొదటిసారిగా అసెంబ్లీ (Assembly) లో మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఎన్నికైన సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు అయ్యన్నపాత్రుడి వాడివేడీ చూసిన ప్రజలు ఇకనుంచి తన హుందాతనాన్ని చూస్తారన్నారు. కానీ ఆయనకు తిట్టే అవకాశం లేకపోవడమే బాధేస్తోందంటూ సరదాగా అన్నారు. ఇకనుంచి ఎవరైనా తిట్టినా వాళ్లని అదుపు చేసే బాధ్యత మీపై ఉందని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి.
Also read: అందుకే అప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నా : చంద్రబాబు