Telangana : త్వరలో మెగా డీఎస్సీ.. జాబ్‌ క్యాలెండర్‌ : భట్టి విక్రమార్క

త్వరలో 15 వేల మంది కానిస్టేబుళ్లు రిక్రూట్‌మెంట్‌ను పూర్తి చేస్తామని అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మెగా డీఎస్సీని కూడా త్వరలో నిర్వహించబోతున్నామని.. జాబ్‌ క్యాలెండర్‌ను తయారుచేస్తున్నామని స్పష్టం చేశారు.

TS Mega DSC 2024: తెలంగాణ మెగా డీఎస్సీ...ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయి..పూర్తి వివరాలివే.!
New Update

Mega DSC Calendar : తెలంగాణ(Telangana) అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు(Assembly Budget Sessions) ప్రారంభమయ్యాయి. రూ.2,75,891 కోట్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఓటాన్ అకౌండ్ బడ్జెట్‌(Vote On Account Budget) ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ.. త్వరలో 15 వేల మంది కానిస్టేబుళ్లు రిక్రూట్‌మెంట్‌ను పూర్తి చేస్తామని అన్నారు. మెగా డీఎస్సీ(Mega DSC) ని కూడా త్వరలో నిర్వహించబోతున్నామని తెలిపారు. అలాగే జాబ్‌ క్యాలెండర్‌ను తయారుచేస్తున్నామని తెలిపారు.10 ఏళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క గ్రూప్‌-1 ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు.

Also Read : మిగిలన టెస్ట్‌ల్లోనూ కోహ్లీ ఆడటం లేదు..బీసీసీఐ

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ను ప్రక్షాళన చేశామని అన్నారు. TSPSC కి రూ.40 కోట్ల ఆర్థిక వనరులు కేటాయించామని తెలిపారు. తాత్కాలిక ఉద్యోగులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. విద్యారంగానికి రూ.21389 కోట్లు, వైద్య రంగానికి రూ.11,500 కేటాయించామని అన్నారు. త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తామని.. ఈ స్కూళ్లకు రూ.500 కోట్లు కేటాయించామని తెలిపారు.

65 ఐటీఐలను ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం అవుతామని.. గుజరాత్‌, ఢిల్లీ, ఒడిశా తరహాలో స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లు కేటాయించామని వివరించారు. యువకులను రెచ్చగొట్టేలా కాదు.. ఆత్మగౌరవంతో బతికేలా చేస్తామని అన్నారు. మరోవైపు ఆరు గ్యారెంటీల అమలు కోసం రాష్ట్ర సర్కార్ రూ.53,196 కోట్లు కేటాయించింది.

Also Read: సీఎం రేవంత్‌ను కలవనున్న ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి.. ఎందుకంటే

#telugu-news #telangana-news #bhatti-vikramarka #telangana-mega-dsc
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe