Telangana : సంపద సృష్టించే వారికి అవసరమైన సాయం చేస్తాం : భట్టి విక్రమార్క
తెలంగాణ ప్రభుత్వం బిల్డర్లను కాంట్రాక్టర్లుగా కాకుండా.. సంపదను సృష్టించేవారిలా చూస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిర్మాణ రంగ సంస్థలకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని.. వారికి అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Bhatti Vikramarka : హైదరాబాద్(Hyderabad) లోని హైటెక్‌సిటీ(Hitech City) లో బిల్డర్స్ ఆఫ్ ఇండియా 31 కన్వెన్షన్ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా రెండోరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana) ప్రభుత్వం బిల్డర్లను కాంట్రాక్టర్లుగా కాకుండా.. సంపదను సృష్టించేవారిలా చూస్తోందని అన్నారు. దేశ నిర్మాణ రంగంలో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందజేయాలంటే సంపద కావాలి. సంపద సృష్టించే సంస్థలు వచ్చినప్పుడే.. ప్రభుత్వాలు ప్రజల అవసరాలు తీర్చగలవు అని వ్యాఖ్యానించారు. సంపద సృష్టించే వారి మనసులను గాయపరిచే ఆలోచన ఇందిరమ్మ రాజ్యంలో ఉండదన్నారు. చాలావరకు నిర్మాణ రంగ సంస్థలు బ్యాంకు గ్యారంటీ రుణాలు తెచ్చుకున్నాయని.. కానీ ఆ సంస్థలు పెట్టుబడి పెట్టిన తర్వాత సమయానికి బిల్లులు రాకపోవడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
అవసరమైన సాయం చేస్తాం
ప్రస్తుతం నెలకొన్న ఈ సమస్యను సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది తెలంగాణకు వచ్చి ఇక్కడ స్థిరపడి వ్యాపారాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి వచ్చి సంపద సృష్టించే వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.

Also Read: కారు హ్యాండ్ బ్రేక్ ని హ్యాండిల్ చేయడం ఎలా అంటే..
ఆర్థిక ఇబ్బందులున్నాయి
రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందజేయాలంటే సంపద కావాలి. సంపద సృష్టించే సంస్థలు వచ్చినప్పుడే.. ప్రభుత్వాలు ప్రజల అవసరాలు తీర్చగలవు అని వ్యాఖ్యానించారు. సంపద సృష్టించే వారి మనసులను గాయపరిచే ఆలోచన ఇందిరమ్మ రాజ్యంలో ఉండదన్నారు. చాలావరకు నిర్మాణ రంగ సంస్థలు బ్యాంకు గ్యారంటీ రుణాలు తెచ్చుకున్నాయని.. కానీ ఆ సంస్థలు పెట్టుబడి పెట్టిన తర్వాత సమయానికి బిల్లులు రాకపోవడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
అవసరమైన సాయం చేస్తాం
ప్రస్తుతం నెలకొన్న ఈ సమస్యను సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది తెలంగాణకు వచ్చి ఇక్కడ స్థిరపడి వ్యాపారాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి వచ్చి సంపద సృష్టించే వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.
Also Read: సొంత జిల్లాలో కేటీఆర్‌కు బిగ్ షాక్